search
×

Stock Market Today: జస్ట్‌ 60 పాయింట్ల దూరంలో నిఫ్టీ 20,000 లెవల్‌!

Stock Market at 12 PM, 11 September 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం దూసుకుపోతున్నాయి. జీవన కాల గరిష్ఠాలకు సమీపంలో ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market at 12 PM, 11 September 2023: 

స్టాక్‌ మార్కెట్లు సోమవారం దూసుకుపోతున్నాయి. జీవన కాల గరిష్ఠాలకు సమీపంలో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధం లేకుండా ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 119 పాయింట్లు పెరిగి 19,939 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 319 పాయింట్లు పెరిగి 66,918 వద్ద కొనసాగుతున్నాయి. మరో 60 పాయింట్లు పెరిగితే నిఫ్టీ 20వేల మార్కును టచ్‌ చేస్తుంది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,598 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,807 వద్ద మొదలైంది. 65,735 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,989 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 319 పాయింట్ల లాభంతో 66,918 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 19,819 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,890 వద్ద ఓపెనైంది. 19,865 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,948 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 119 పాయింట్లు పెరిగి 19,939 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,340 వద్ద మొదలైంది. 45,231 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,441 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 248 పాయింట్లు ఎగిసి 44,405 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 44 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, అపోలో హాస్పిటల్స్‌, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి. కోల్‌ ఇండియా, సిప్లా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. మీడియా మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ రంగాల షేర్లకు డిమాండ్‌ పెరిగింది.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.59,830 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.23,830 వద్ద ఉంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

క్రితం రోజు 66,265 వద్ద మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 66,381 వద్ద మొదలైంది. 66,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 12 గంటల ప్రాంతంలో పుంజుకున్న సూచీల 66,766 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకొంది. చివరికి 333 పాయింట్ల లాభంతో 66,598 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,774 వద్ద మొదలై 19,727 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకొంది. మధ్యాహ్నం 19,867 వద్ద గరిష్ఠాన్ని అందుకొన్న సూచీ మొత్తంగా 92 పాయింట్లు ఎగిసి 19,819 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 278 పాయింట్లు పెరిగి 45,156 వద్ద ముగిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 11 Sep 2023 12:23 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

టాప్ స్టోరీస్

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు

Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు

Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు

Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు

Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు

Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు