By: Rama Krishna Paladi | Updated at : 28 Aug 2023 12:34 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market at 12 PM, 28 August 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 56 పాయింట్లు పెరిగి 19,322 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 164 పాయింట్లు పెరిగి 65,051 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,886 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 64,908 వద్ద మొదలైంది. 64,776 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,083 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 164 పాయింట్ల లాభంతో 65,051 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,265 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,298 వద్ద ఓపెనైంది. 19,249 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,329 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 56 పాయింట్లు ఎగిసి 19,322 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 44,253 వద్ద మొదలైంది. 44,201 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,443 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 179 పాయింట్లు పెరిగి 44,410 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్స్, బీపీసీఎల్, సిప్లా, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, హిందుస్థాన్ యునీలివర్, నెస్లే ఇండియా, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. ఆటో, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.76,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.25,080 వద్ద ఉంది.
Also Read: ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయొచ్చా!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు