By: ABP Desam | Updated at : 31 Mar 2023 11:16 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 31 March 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం కళకళలాడుతున్నాయి. రాకెట్ వేగంతో ఎగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 164 పాయింట్లు పెరిగి 17,245 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 557 పాయింట్లు పెరిగి 58,543 వద్ద ఉన్నాయి. రిలయన్స్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 57,960 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,273 వద్ద మొదలైంది. 58,273 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,709 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 557 పాయింట్ల లాభంతో 58,543 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,080 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,210 వద్ద ఓపెనైంది. 17,204 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,289 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 164 పాయింట్లు పెరిగి 17,245 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 40,231 వద్ద మొదలైంది. 40,180 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,523 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 511 పాయింట్లు పెరిగి 40,421 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,000 గా ఉంది. కిలో వెండి రూ.700 పెరిగి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.510 తగ్గి రూ.26,050 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) March 31, 2023
Visit https://t.co/ni4rMKm1RF to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/QO7IwZ48Pu
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) March 30, 2023
Visit https://t.co/ni4rMKlu27 to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/8oAnoKMsri
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
KTR: ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?