By: ABP Desam | Updated at : 30 Dec 2022 11:34 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 30 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్ల లాభంతో 18,221 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 109 పాయింట్ల లాభంతో 61,243 వద్ద కొనసాగుతోంది.
BSE Sensex
క్రితం సెషన్లో 61,133 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,329 వద్ద మొదలైంది. 61,202 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,392 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 109 పాయింట్ల లాభంతో 61,243 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 18,191 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,259 వద్ద ఓపెనైంది. 18,210 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,265 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 30 పాయింట్ల లాభంతో 18,221 వద్ద నడుస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 43,401 వద్ద మొదలైంది. 43,099 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,422 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 139 పాయింట్లు తగ్గి 43,112 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐచర్ మోటార్స్, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు