By: ABP Desam | Updated at : 30 Aug 2022 09:54 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Opening Bell 30 August 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ఓపెనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఇవాళ ఉదయం 7.30 గం. సమయానికి సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఆ సమయంలో 61 పాయింట్లు లేదా 0.35 శాతం గ్రీన్‌తో 17,441.5 వద్ద ట్రేడవ్వడంతో ఇక్కడ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 151 పాయింట్ల లాభంతో 17,461 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 494 పాయింట్ల లాభంతో 58,466 వద్ద ఉన్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 57,972 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,259 వద్ద మొదలైంది. 58,245 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,488 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆరంభంలోనే 494 పాయింట్ల లాభంతో 58,466 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 17,312వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,414 వద్ద ఓపెనైంది. 17,401 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,472 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 9:30 గంటలకు 151 పాయింట్ల లాభంతో 17,464 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఓపెనైంది. ఉదయం 38,516 వద్ద మొదలైంది. 38,472 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,769 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 471 పాయింట్ల లాభంతో 38,748 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 48 కంపెనీలు లాభాల్లో 2 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్, మీడియా, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1-2 శాతం ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
RAPO22 Title: రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy