search
×

Stock Market News: ఒలటిలిటీ ఉన్నా లాభాల్లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ - ఫార్మా షేర్లకు గిరాకీ!

Stock Market Opening 27 March 2023: గ్లోబల్‌ బ్యాంకింగ్‌ క్రైసిస్‌ నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 27 March 2023: 

స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. గ్లోబల్‌ బ్యాంకింగ్‌ క్రైసిస్‌ నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 47 పాయింట్లు పెరిగి 16,997 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 166 పాయింట్లు పెరిగి 57,677 వద్ద కొనసాగుతోంది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 57,527 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,566 వద్ద మొదలైంది. 57,415 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,851 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 166 పాయింట్ల లాభంతో 57,677 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 16,945 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 16,984 వద్ద ఓపెనైంది. 16,918 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,044 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 47 పాయింట్లు పెరిగి 16,997 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 39,484 వద్ద మొదలైంది. 39,318 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,586 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 41 పాయింట్లు తగ్గి 39,354 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, రిలయన్స్‌, అపోలో హాస్పిటల్స్‌, సన్ ఫార్మా, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఎం అండ్‌ ఎం, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.59,730 గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.73,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.26,740 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 27 Mar 2023 11:08 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news BSE Sensex

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Pushpa 2 Review - పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?

Pushpa 2 Review - పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!

Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ

Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ

Rayachoti Teacher Death: తరగతి గదిలో ఉపాధ్యాయుని అనుమానాస్పద మృతి - విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడా?, రాయచోటిలో విషాద ఘటన

Rayachoti Teacher Death: తరగతి గదిలో ఉపాధ్యాయుని అనుమానాస్పద మృతి - విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడా?, రాయచోటిలో విషాద ఘటన