By: ABP Desam | Updated at : 24 Feb 2023 11:32 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 24 February 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఇండియా విక్స్ తగ్గడం మదుపర్లు కొనుగోళ్లు చేపడతారని సూచిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 1 పాయింట్లు పెరిగి 17,512 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 48 పాయింట్ల పెరిగి 59,654 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో టాప్ టాసర్స్.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,605 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,859 వద్ద మొదలైంది. 59,603 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,859 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 48 పాయింట్ల లాభంతో 59,654 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,511 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,591 వద్ద ఓపెనైంది. 17,501 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,599 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 1 పాయింటు పెరిగి 17,511 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్‌గా మొదలైంది. ఉదయం 40,259 వద్ద మొదలైంది. 39,939 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,348 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 1 పాయింట్లు పెరిగి 40,002 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐచర్ మోటార్స్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మీడియా, ఫార్మా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.68,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.240 తగ్గి రూ.25,150 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) February 24, 2023
Visit https://t.co/ni4rMKlu27 to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/MWx6McccEt
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) February 24, 2023
Visit https://t.co/ni4rMKlu27 to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/LR2bx51QdW
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత