search
×

Stock Market News: ఊగిసలాడి ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ - బలపడ్డ రూపాయి

Stock Market Opening 23 February 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఉదయం స్వల్ప లాభాల్లో కదలాడాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 23 February 2023: 

స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఉదయం స్వల్ప లాభాల్లో కదలాడాయి. మధ్యాహ్నం తర్వాత రోజువారీ కనిష్ఠాలకు చేరుకున్నాయి. చివరికి మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో రికవరీ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 43 పాయింట్లు పెరిగి 17,511 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 139 పాయింట్ల పెరిగి 59,605 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడి రూ.82.73 వద్ద ముగిసింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 59,744 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,777 వద్ద మొదలైంది. 59,406 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,960 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 139 పాయింట్ల నష్టంతో 59,605 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 17,554 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,574 వద్ద ఓపెనైంది. 17,455 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,620 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 43 పాయింట్లు పెరిగి 17,511 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ ఫ్లాట్‌గా ముగిసింది. ఉదయం 39,983 వద్ద మొదలైంది. 39,600 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,147 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 5 పాయింట్లు పెరిగి 40,001 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, కోల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్‌ పెయింట్స్‌, ఎల్‌టీ, టైటాన్‌, దివిస్‌ ల్యాబ్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఎగిశాయి. ఫైనాన్స్‌, మీడియా, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ పతనమయ్యాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 220 తగ్గి రూ.56,510గా ఉంది. కిలో వెండి రూ.68,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.310 పెరిగి రూ.25,390 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 23 Feb 2023 04:16 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

Stock Market News: ఈక్విటీ మార్కెట్లో ఈ జోష్‌ ఎక్కడిదీ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: ఈక్విటీ మార్కెట్లో ఈ జోష్‌ ఎక్కడిదీ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Opening 29 March 2023: అదానీ షేర్ల జోరు - నిఫ్టీ 80, సెన్సెక్స్‌ 229 పాయింట్లు అప్‌!

Stock Market Opening 29 March 2023: అదానీ షేర్ల జోరు - నిఫ్టీ 80, సెన్సెక్స్‌ 229 పాయింట్లు అప్‌!

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం