By: Rama Krishna Paladi | Updated at : 18 Jul 2023 11:13 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market Opening 18 July 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం రైజింగ్‌లో ఉన్నాయి. ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడితే సెన్సెక్స్ 67వేల మైలురాయి దాటడం గ్యారంటీ! నేటి ఉదయం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 78 పాయింట్లు పెరిగి 19,790 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 298 పాయింట్లు పెరిగి 66,888 వద్ద కొనసాగుతున్నాయి. విలువైన లోహాల ధరలు పెరిగాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,589 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,828 వద్ద మొదలైంది. 66,696 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,985 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 298 పాయింట్ల లాభంతో 66,888 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,711 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,787 వద్ద ఓపెనైంది. 19,738 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 78 పాయింట్లు పెరిగి 19,790 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,757 వద్ద మొదలైంది. 45,580 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,905 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 287 పాయింట్లు పెరిగి 45,737 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇన్ఫీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.120 పెరిగి రూ.60,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.25,920 వద్ద ఉంది.
Also Read: పతంజలి ఫుడ్స్‌పై కన్నేసిన 'అదానీ ఇన్వెస్టర్'! టార్గెట్ పెంచేశారుగా!!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Take an informed decision before trading in options! Visit https://t.co/upsWAG3t1V to know more.#NSEIndia #OptionsTrading #DueDiligence #Investing #InvestorEducation #StockMarket #MarketAnalysis @ashishchauhan
— NSE India (@NSEIndia) July 18, 2023
Be part of a joint Investor Awareness Program by SEBI, NSE and NSDL on 18th July'23 at 11:30 AM at Burdwan, West Bengal. Hurry up! Limited seats available.#InvestorAwareness #IAPs @ashishchauhan pic.twitter.com/TVIU2Wpf6n
— NSE India (@NSEIndia) July 17, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
TVS Sport: టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?