By: ABP Desam, Rama Krishna Paladi | Updated at : 13 Apr 2023 11:37 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Opening 13 April 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. టీసీఎస్ ఫలితాలు నిరాశపరచడంతో ఐటీ సూచీ కుంగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 57 పాయింట్లు తగ్గి 17,754 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 223 పాయింట్లు తగ్గి 60,169 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,392 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,364 వద్ద మొదలైంది. 60,113 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,423 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 223 పాయింట్ల నష్టంతో 60,169 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,812 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,807 వద్ద ఓపెనైంది. 17,736 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 57 పాయింట్లు తగ్గి 17,754 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,680 వద్ద మొదలైంది. 41,502 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,798 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 81 పాయింట్లు పెరిగి 41,639 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, ఐచర్ మోటార్స్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా సూచీలు ఎక్కువ నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.61,200గా ఉంది. కిలో వెండి రూ.650 పెరిగి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.470 పెరిగి రూ.26,860 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Always do your due diligence before investing in equities!#NSEIndia #Investorawareness #StockMarket #sharemarket @ashishchauhan pic.twitter.com/zO9hs5ELlo
— NSE India (@NSEIndia) April 13, 2023
In today's #StockTerm, let's look at what Cross Margining is!#NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #Crossmargining pic.twitter.com/CWxrADOQIc
— NSE India (@NSEIndia) April 12, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం