By: ABP Desam, Rama Krishna Paladi | Updated at : 11 Apr 2023 10:49 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 11 April 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. బ్యాంకు షేర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 102 పాయింట్లు పెరిగి 17,726 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 338 పాయింట్లు పెరిగి 60,189 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,846 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,028 వద్ద మొదలైంది. 59,968 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,267 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 338 పాయింట్ల లాభంతో 60,189 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,624 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,704 వద్ద ఓపెనైంది. 17,663 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,663 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 102 పాయింట్లు పెరిగి 17,726 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,232 వద్ద మొదలైంది. 40,990 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,323 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 466 పాయింట్లు పెరిగి 41,301 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 8 నష్టాల్లో ఉన్నాయి. కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, ఎల్‌టీ, హీరోమోటో కార్ప్, విప్రో షేర్లు నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,760గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.76,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.180 తగ్గి రూ.26,230 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations to Hero MotoCorp Ltd. for completing 20 years of #listing at #NSE.#Listed #ListingAnniversary #Nifty50 #Nifty50Companies #ShareMarket #StockMarket @HeroMotoCorp pic.twitter.com/XZvy5L8aLw
— NSE India (@NSEIndia) April 11, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) April 10, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/Dy3dyNxCSg
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం