By: ABP Desam | Updated at : 09 May 2023 10:55 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 09 May 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఈక్విటీ మార్కెట్లో బుల్ రన్ సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 57 పాయింట్లు పెరిగి 18,322 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 213 పాయింట్లు పెరిగి 61,977 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,764 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,879 వద్ద మొదలైంది. 61,808 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,007 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 213 పాయింట్ల లాభంతో 61,977 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమారం 18,264 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,303 వద్ద ఓపెనైంది. 18,276 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,338 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 57 పాయింట్లు పెరిగి 18,322 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,౪౩౮ వద్ద మొదలైంది. 42,279 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,493 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 124 పాయింట్లు పెరిగి 43,408 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, హిందుస్థాన్ యునీలివర్, గ్రాసిమ్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఫైనాన్స్, బ్యాంకు, ఐటీ, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.61,850గా ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.78,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.27,900 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations Mankind Pharma Limited on getting listed on the Exchange today!
— NSE India (@NSEIndia) May 9, 2023
Mankind Pharma has one of the largest distribution networks of medical representatives in the Indian pharmaceutical market. Over 80% of doctors in India prescribed their formulations and has been… pic.twitter.com/r3VzYIOOYP
The #NSEBell has rung in the celebration of the listing ceremony of Mankind Pharma Limited on the Exchange today! #NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #Mankind #Pharma @ashishchauhan @Pharma_Mankind pic.twitter.com/b9c5FSsBXF
— NSE India (@NSEIndia) May 9, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా