By: ABP Desam | Updated at : 03 Feb 2023 10:26 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market Opening 03 February 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఆరంభమయ్యాయి. అదానీ గ్రూప్ షేర్ల ప్రతికూల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పైగా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 66 పాయింట్ల లాభంతో 17,676 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 365 పాయింట్ల లాభంతో 60,297 వద్ద కొనసాగుతున్నాయి. టైటాన్, ఇండస్ ఇండ్ షేర్లకు గిరాకీ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,932 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,350 వద్ద మొదలైంది. 60,143 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,414 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 365 పాయింట్ల లాభంతో 60,297 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,610 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,721 వద్ద ఓపెనైంది. 17,642 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,728 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 66 పాయింట్ల లాభంతో 17,676 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 41,019 వద్ద మొదలైంది. 40,915 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,284 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 473 పాయింట్లు పెరిగి 41,143 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. టైటాన్ (Titan), ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్, హిందాల్కో, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేటు బ్యాంకు రంగాల సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ స్టాక్స్: అదానీ స్టాక్స్‌లో గురువారం వరకు జోరుగా అమ్మకాలు కొనసాగింది. ఇవాళ కూడా ఈ గ్రూప్ స్టాక్స్ మరోసారి మార్కెట్ యాక్షన్‌ను నిర్ణయించనున్నాయి. పతనం ఆగిపోయే వరకు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండడం అవసరం.
SBI: ప్రభుత్వ రంగ రుణదాత SBI, మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. బ్యాంక్ నికర లాభం గత సంవత్సరంతో పోలిస్తే 60- 70% భారీ వృద్ధితో ఘనమైన సంఖ్యలను నివేదించనత్తని అంచనా. నికర వడ్డీ ఆదాయం (NII) కూడా ఆరోగ్యకరంగా రెండంకెల్లో పెరుగుతుందని అంచనా.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Maharashtra New Government: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్