By: ABP Desam | Updated at : 01 Oct 2022 10:47 AM (IST)
Edited By: Arunmali
ఆర్‌బీఐ రేట్ హైక్‌తో రికార్డ్ స్థాయికి పెరిగిన 8 స్టాక్స్
Stock Market News: వరుసగా ఏడు సెషన్లు నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్ల లాభంతో 57,426 స్థాయి వద్ద ముగిసింది. నిప్టీ 276 పాయింట్లు పెరిగి 17,094 వద్ద ఆగింది, కీలకమైన 17K మార్కును నిలబెట్టుకుంది. RBI రెపో రేటు పెంపు, మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే 50 బేసిస్ పాయింట్లు కావడంతో బుల్స్ బలం పెరిగింది.
నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు 1 శాతానికి పైగా పెరిగాయి. రేట్ల పెంపు ప్రభావం ప్రత్యక్షంగా కనిపించే బ్యాంక్ షేర్లలో లాభాల పంట పండింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 984 పాయింట్లు లేదా 2.61 శాతం రాణించింది.
ఈ ర్యాలీలో, BSE 500 ప్యాక్‌లోని 8 స్టాక్స్ కొత్తగా 52 వారాల గరిష్టాలతో రికార్డ్ స్థాయిని తాకాయి.
గత ఒక సంవత్సర కాలంలో ఒక షేరు ట్రేడయిన అత్యధిక ధరను 52 వారాల గరిష్ట స్థాయి లేదా రికార్డ్ హై అంటారు. స్టాక్ ప్రస్తుత విలువను విశ్లేషించడానికి, దాని భవిష్యత్తు కదలికను అంచనా వేయడానికి ఈ స్థాయిని ఒక సాంకేతిక సూచికగా కొందరు ట్రేడర్లు ఉపయోగించుకుంటారు. సాధారణంగా, ఒక స్టాక్ కొత్తగా 52 వారాల గరిష్ట స్థాయిని తాకిందంటే ఆ షేర్లకు గిరాకీ పెరిగిందని అర్ధం. ప్రస్తుతం అది అప్‌ట్రెండ్‌లో ఉన్నట్లుగా భావించవచ్చు.
కొత్తగా 52 వారాల గరిష్టాలను తాకిన స్టాక్స్:
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (Aditya Birla Fashion and Retail )
కొత్త 52 వారాల గరిష స్థాయి: రూ.352
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ.349
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు 16 శాతం లాభపడింది.
భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel)
కొత్త 52 వారాల గరిష స్థాయి: రూ.809
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ.780
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు 11 శాతం లాభపడింది.
సిప్లా (Cipla)
కొత్త 52 వారాల గరిష స్థాయి: రూ.1128
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ.1115
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు 10 శాతం లాభపడింది.
కొచ్చిన్ షిప్‌యార్డ్ (Cochin Shipyard)
కొత్త 52 వారాల గరిష స్థాయి: రూ.444
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ.442
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు 17 శాతం లాభపడింది.
గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ (Gujarat Fluorochemicals)
కొత్త 52 వారాల గరిష స్థాయి: రూ.4025
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ.3937
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు 21 శాతం లాభపడింది.
కిమ్స్ (Krishna Institute of Medical Sciences)
కొత్త 52 వారాల గరిష స్థాయి: రూ.1573
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ.1512
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు 28 శాతం లాభపడింది.
మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ (Mazagon Dock Shipbuilders)
కొత్త 52 వారాల గరిష స్థాయి: రూ.499
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ.493
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు 25 శాతం లాభపడింది.
సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India)
కొత్త 52 వారాల గరిష స్థాయి: రూ.3972
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ.3921
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ దాదాపు 19 శాతం లాభపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి