By: Rama Krishna Paladi | Updated at : 31 Jul 2023 03:54 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 31 July 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మెల్లగా జోరు అందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 107 పాయింట్లు పెరిగి 19,753 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 367 పాయింట్లు ఎగిసి 66,527 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.25 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,160 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,156 వద్ద మొదలైంది. 65,998 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,598 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 367 పాయింట్ల లాభంతో 66,527 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,646 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,666 వద్ద ఓపెనైంది. 19,597 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,772 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 107 పాయింట్లు పెరిగి 19,753 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,546 వద్ద మొదలైంది. 45,359 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,694 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 183 పాయింట్లు పెరిగి 45,651 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.60,280 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.77000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,590 వద్ద కొనసాగుతోంది.
Also Read: పోస్టాఫీస్ నుంచి 3 బెస్ట్ స్కీమ్స్, వడ్డీతోనే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Investors must transfer shares to the Stockbroker only if they are sold on the Stock Exchange platform. Know more: https://t.co/9wkVNEaKXk#NSE #NSEIndia #marginpledge #transfershares #shares @ashishchauhan
— NSE India (@NSEIndia) July 31, 2023
Arbitration is a quasi-judicial process of settlement of disputes between Investor and company/RTA.#NSE #NSEIndia #DisputeResolution #Arbitration #InvestorAwareness #StockMarket #ShareMarket @ashishchauhan
— NSE India (@NSEIndia) July 30, 2023
Take an informed decision before trading in options! Visit https://t.co/upsWAG3t1V to know more.#NSEIndia #OptionsTrading #DueDiligence #Investing #InvestorEducation #StockMarket #MarketAnalysis @ashishchauhan
— NSE India (@NSEIndia) July 30, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !