search
×

Stock Market New Highs: బుల్‌ రైజ్‌! 63వేల మార్క్‌ టచ్‌ చేసిన సెన్సెక్స్‌, 18750పైనే క్లోజైన నిఫ్టీ

Stock Market Closing 30 November 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. వరుసగా ఏడో సెషన్లో సరికొత్త గరిష్ఠాల్లో ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 30 November 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. వరుసగా ఏడో సెషన్లో సరికొత్త గరిష్ఠాల్లో ముగిశాయి.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధం లేకుండా మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 140 పాయింట్ల లాభంతో 18,758 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 417 పాయింట్ల లాభంతో 63,099 వద్ద ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 81.42 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 62,681 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,743 వద్ద మొదలైంది. 62,648 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,303 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 417 పాయింట్ల లాభంతో 63,099 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 18,618 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,625 వద్ద ఓపెనైంది. 18,616 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,816 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 140 పాయింట్ల లాభంతో 18,758 వద్ద స్థిరపడింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చింది. ఉదయం 43,122 వద్ద మొదలైంది. 42,880 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,332 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 177 పాయింట్ల లాభంతో 43,231 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 45 కంపెనీలు లాభాల్లో 4 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, గ్రాసిమ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు పరుగులు పెట్టాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ నష్టపోయాయి. పీఎస్‌యూ మినహా మిగతా రంగాల సూచీలన్నీ గ్రీన్‌లో కళకళలాడాయి. రియాల్టీ, మెటల్‌, ఆటో సూచీలు ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 30 Nov 2022 04:02 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు

HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం

HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం

Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!

Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!

HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే