By: Rama Krishna Paladi | Updated at : 03 Jul 2023 04:01 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market Closing 3 July 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. మరో కొత్త లైఫ్ టైమ్ హై పాయింట్‌ను టచ్ చేశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 133 పాయింట్లు పెరిగి తొలిసారి 19,322 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 486 పాయింట్లు పెరిగి 65,205 వద్ద ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలపడి 82.04 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు నేడు మరో రూ.2 లక్షల కోట్లు ఆర్జించారు.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 64,718 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 64,836 వద్ద మొదలైంది. 64,836 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,300 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 486 పాయింట్ల లాభంతో 65,205 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,189 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,246 వద్ద ఓపెనైంది. 19,234 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,345 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 133 పాయింట్ల లాభంతో 19,322 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,957 వద్ద మొదలైంది. 44,882 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,353 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 410 పాయింట్లు పెరిగి 45,158 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, గ్రాసిమ్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, మారుతీ, సిప్లా నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.88 తగ్గి రూ.58,960గా ఉంది. కిలో వెండి రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.23,810 వద్ద ఉంది.
Also Read: యెస్ బ్యాంక్ FDలపై మరింత ఆదాయం - వడ్డీ రేట్లు పెంపు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Watch the Bell Ringing Ceremony live | Full liquidity switch of NSE IX - Gift Nifty at 3.15 PM today. https://t.co/G9pra6mUNA @nse_ix @nseindia @AshishChauhan @balav1971 #GiftNifty #NSEIX https://t.co/G9pra6mUNA
— NSE IX Gift Nifty (@NSEIXGiftNifty) July 3, 2023
Congratulations to Gensol Engineering Limited on getting listed on NSE today.#NSE #NSEIndia #listing #IPO #StockMarket #ShareMarket #GensolEngineeringLimited @ashishchauhan pic.twitter.com/jVNp9WsvCK
— NSE India (@NSEIndia) July 3, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy