By: ABP Desam | Updated at : 29 May 2023 03:48 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Getty )
Stock Market Closing 29 May 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. అమెరికా డెట్ సీలింగ్ అంశం తాత్కాలికంగా సద్దుమణగడం ఇంపాక్ట్ చూపించింది. కొన్ని కంపెనీల ఫలితాలూ మదుపర్లలో జోష్ పెంచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 99 పాయింట్లు పెరిగి 18,598 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 344 పాయింట్లు ఎగిసి 62,846 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే 82.63 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,501 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,801 వద్ద మొదలైంది. 62,801 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,026 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 344 పాయింట్ల లాభంతో 62,846 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 18,499 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,619 వద్ద ఓపెనైంది. 18,581 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,641 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 99 పాయింట్లు పెరిగి 18,598 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 44,276 వద్ద మొదలైంది. 44,193 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,483 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 293 పాయింట్లు పెరిగి 44,311 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, టైటాన్, కోల్ ఇండియా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, దివిస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎక్కువ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,600గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.27,240 వద్ద ఉంది.
Also Read: మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్' మీ దగ్గర ఉన్నాయా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Hon'ble Consul General of South Africa, Ms. Andrea Kuhn and Mr. Dean Hoff, Consul Economic, for the republic of South Africa rang the #NSEBell along with our MD & CEO, Shri @ashishchauhan, during their visit to NSE HO, today.#NSEIndia #VisittoNSE #BellRinging @AndreaKhn5 pic.twitter.com/kFCxqPo7us
— NSE India (@NSEIndia) May 29, 2023
Take an informed decision before trading in options! Visit https://t.co/upsWAG2Vcn to know more.#NSEIndia #OptionsTrading #DueDiligence #Investing #InvestorEducation #StockMarket #MarketAnalysis @ashishchauhan pic.twitter.com/TiUKIEBaHt
— NSE India (@NSEIndia) May 29, 2023
Can you spot the 3 companies from the Electricals sector that are listed on NSE? Write your answers in the comments.#NSECrossword #Crossword #ShareMarket #StockMarket #NIFTY50 #Investor pic.twitter.com/iNCyHjSZZ5
— NSE India (@NSEIndia) May 28, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు