search
×

Stock Market Today: కొంప ముంచిన ఫెడ్‌ - సెన్సెక్స్‌ 440 పాయింట్లు క్రాష్‌!

Stock Market Closing 27 July 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. యూఎస్‌ ఫెడ్ 22 ఏళ్ల గరిష్ఠ స్థాయికి వడ్డీరేట్లు పెంచడం మదుపర్లు సెంటిమెంటు దెబ్బతీసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 27 July 2023:

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. యూఎస్‌ ఫెడ్ 22 ఏళ్ల గరిష్ఠ స్థాయికి వడ్డీరేట్లు పెంచడం మదుపర్లు సెంటిమెంటు దెబ్బతీసింది. ఐరోపా మార్కెట్లు తెరిచాక పతనం మరింత ఎక్కువైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 118 పాయింట్లు తగ్గి 19,659 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 440 పాయింట్లు పతనమై 66,266 వద్ద ముగిశాయి. రియాల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.95 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,707 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,834 వద్ద మొదలైంది. 66,060 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,984 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 440 పాయింట్ల నష్టంతో 66,266 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,778 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,850 వద్ద ఓపెనైంది. 19,603 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,867 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 118 పాయింట్లు తగ్గి 19,659 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 46,285 వద్ద మొదలైంది. 45,570 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,310 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 383 పాయింట్లు తగ్గి 45,679 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, సన్‌ఫార్మా,  దివిస్‌ ల్యాబ్‌, హీరో మోటో కార్ప్‌, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా, టాటా కన్జూమర్‌, బ్రిటానియా, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1100 పెరిగి రూ.81500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.25,520 వద్ద కొనసాగుతోంది.

Also Read: బెంగళూరులో అద్దె ఇల్లు - దొరకాలంటే గగనమే! వర్క్ ఫ్రమ్‌ ఆఫీసే రీజన్‌!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 27 Jul 2023 04:06 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

Loan On Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద లోన్‌ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!

Loan On Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద లోన్‌ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి