By: ABP Desam | Updated at : 24 Feb 2023 04:03 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 24 February 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మెటల్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్లు తగ్గి 17,465 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 141 పాయింట్ల తగ్గి 59,463 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా బలహీనపడి రూ.82.75 వద్ద స్థిరపడింది. మెటల్ సూచీ ఏకంగా 3 శాతం పతనమైంది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,605 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,859 వద్ద మొదలైంది. 59,325 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,908 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,511 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,591 వద్ద ఓపెనైంది. 17,421 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,599 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 45 పాయింట్లు తగ్గి 17,465 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఉదయం 40,259 వద్ద మొదలైంది. 39,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,348 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 92 పాయింట్లు పతనమై 39,909 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూస్టీల్, టాటాస్టీల్ షేర్లు నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి. మెటల్, రియాల్టీ, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకు సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.68,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.240 తగ్గి రూ.25,150 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Press Release: "NSE Indices launches India’s first Municipal Bond Index." For more details visit: https://t.co/2ZvhLUI6t4 #NSEIndia #StockExchange #PressRelease #MunicipalBondIndex #Index #bondindex @MoHUA_India @SEBI_India @ashishchauhan @mukeshagg67 pic.twitter.com/quIeMrDCDn
— NSE India (@NSEIndia) February 24, 2023
In order to increase transparency and security in trading transactions, the details of the active "Client Bank Account" will be made available to investors by 15th march 2023 on the website of the Exchange and the stock broker. #ClientBankAccount #Funds #Broker @ashishchauhan pic.twitter.com/CJ1Ud2NmOy
— NSE India (@NSEIndia) February 24, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?