search
×

Sensex Today: పొద్దున్నే జంప్‌.. సాయంత్రం డౌన్‌! మళ్లీ 10,400 కిందకు నిఫ్టీ

Stock Market Closing 24 August 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. మూడు రోజుల లాభాలకు తెరపడింది. గిఫ్ట్‌ నిఫ్టీ గ్రీన్‌లో ట్రేడవ్వడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 24 August 2023:

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. మూడు రోజుల లాభాలకు తెరపడింది. గిఫ్ట్‌ నిఫ్టీ గ్రీన్‌లో ట్రేడవ్వడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. దాంతో ఉదయం సూచీలు గరిష్ఠాల్లో ట్రేడయ్యాయి. ఐరోపా మార్కెట్లు మొదలవ్వగానే పతనం మొదలైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 57 పాయింట్లు తగ్గి 19,386 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 180 పాయింట్లు తగ్గి 65,252 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 82.57 వద్ద స్థిరపడింది. రిలయన్స్‌ షేరు నష్టాల్లో ట్రేడవ్వడం సూచీకి ఇబ్బందిగా మారింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,433 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,722 వద్ద మొదలైంది. 65,181 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,913 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 180 పాయింట్ల నష్టంతో 65,252 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,444 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,535 వద్ద ఓపెనైంది. 19,369 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,584 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 57 పాయింట్లు తగ్గి 19,386 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరుగా పెరిగింది. ఉదయం 44,704 వద్ద మొదలైంది. 44,433 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,949 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 17 పాయింట్లు పెరిగి 44,496 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫీ, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్‌, రిలయన్స్‌, దివిస్‌ ల్యాబ్‌, పవర్‌ గ్రిడ్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ సూచీలు పుంజుకున్నాయి. బ్యాంకు, మెటల్స్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,450 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1600 పెరిగి రూ.76,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.24,720 వద్ద ఉంది.

Also Read: పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ రూల్స్‌ మారాయి, మీరు కచ్చితంగా తెలుసుకోవాలి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 24 Aug 2023 03:51 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Today: 20,200 టచ్‌ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Stock Market Today: 20,200 టచ్‌ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

టాప్ స్టోరీస్

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?