search
×

Stock Market Closing: సెన్సెక్స్‌ 980 పాయింట్లు పతనం - రూ.5.50 లక్షల కోట్లు ఖతం!

Stock Market Closing 23 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 23 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. కొవిడ్ భయంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 320 పాయింట్ల నష్టంతో 17,806 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 980 పాయింట్ల నష్టంతో 59,845 వద్ద క్లోజయ్యాయి. ఇన్వెస్టర్లు నేడు రూ.5.50 లక్షల కోట్ల వరకు నష్టపోయారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలహీనపడి 82.86 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,826 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,205 వద్ద మొదలైంది. 59,765 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,546 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 980 పాయింట్ల నష్టంతో 59,845 వద్ద ముగిసింది.

NSE Nifty

గురువారం 18,127 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,977 వద్ద ఓపెనైంది. 17,779 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 320 పాయింట్ల నష్టంతో 17,806 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీగా నష్టపోయింది. ఉదయం 41,951 వద్ద మొదలైంది. 41,597 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,226 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 740 పాయింట్లు పతనమై 41,668 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 3 కంపెనీలు లాభాల్లో 47 నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, దివిస్‌ ల్యాబ్‌, టైటాన్‌ లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.  అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 2 శాతానికి పైగా పతనమయ్యాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 23 Dec 2022 04:35 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

టాప్ స్టోరీస్

Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా

Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా

Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క

Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త

Navratri 2024: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!

Navratri 2024: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!