By: ABP Desam | Updated at : 22 Feb 2023 04:14 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 22 February 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం భయపెట్టాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. కేంద్ర బ్యాంకులు రెపోరేట్లు పెంచుతున్నాయన్న అంచనాలు, అమెరికా ఫెడ్ మినట్స్ విడుదల అవుతుండటం మదుపర్లలో ఆందోళన పెంచాయి. వీటికి తోడుగా అదానీ షేర్ల కుదేలు ఆజ్యం పోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 272 పాయింట్లు తగ్గి 17,554 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 927 పాయింట్ల తగ్గి 59,744 వద్ద ముగిశాయి. మదుపర్లు నేడు రూ.5 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.92 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,672 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,391 వద్ద మొదలైంది. 59,681 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,462 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 927 పాయింట్ల నష్టంతో 59,744 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,826 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,755 వద్ద ఓపెనైంది. 17,529 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,772 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 272 పాయింట్లు తగ్గి 17,554 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ భారీ నష్టపోయింది. ఉదయం 40,494 వద్ద మొదలైంది. 39,899 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,529 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 677 పాయింట్లు తగ్గి 39,995 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు ఎగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో ఎక్కువ మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,730గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.68,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.470 పెరిగి రూ.25,080 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Shri. @AshishChauhan, MD & CEO, NSE at @ASSOCHAM4India's 14th Capital Market Summit - The Re-set of Globalisation Capital Formation @ 2047 for New India, in Mumbai today. #CapitalMarket #StockMarket pic.twitter.com/4vQqfFSCuF
— NSE India (@NSEIndia) February 22, 2023
Ensure you are KYC Compliant to trade in securities market.#KYC #NSE #NSEIndia #InvestorAwareness @ashishchauhan @psubbaraman pic.twitter.com/lZvWK5jwr7
— NSE India (@NSEIndia) February 22, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?