search
×

Sensex Today: ఫ్లాట్‌ క్లోజింగ్‌! 19,400 స్థాయి నిలబెట్టుకోని నిఫ్టీ

Stock Market Closing 22 August 2023: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచి ఒడుదొడుకులకు లోనయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 22 August 2023:

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచి ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఫియర్‌ ఇండెక్స్‌ విక్స్‌ తగ్గుతుండటం శుభసూచకం. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్లు పెరిగి 19,396 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 3 పాయింట్లు పెరిగి 65,220 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 82.93 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,216 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,272 వద్ద మొదలైంది. 65,165 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,362 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 3 పాయింట్ల లాభంతో 65,220 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 19,393 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,417 వద్ద ఓపెనైంది. 19,381 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,443 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 2 పాయింట్లు పెరిగి 19,396 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,125 వద్ద మొదలైంది. 43,938 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 8 పాయింట్లు తగ్గి 43,993 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎన్టీపీసీ, ఐటీసీ, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్‌, సిప్లా, ఐచర్‌ మోటార్స్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.59,130 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1200 పెరిగి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.24,300 వద్ద ఉంది.

Also Read: సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఫేస్‌బుక్‌ మెటా!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 22 Aug 2023 03:57 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

టాప్ స్టోరీస్

Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు

Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు

Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు

Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు

Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి

Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్