By: ABP Desam, Rama Krishna Paladi | Updated at : 12 Apr 2023 03:50 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 12 April 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఫార్మా, ఐటీ, బ్యాంకు షేర్ల గిరాకీతో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్లు పెరిగి 17,812 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 235 పాయింట్లు పెరిగి 60,392 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 82.08 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,157 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,180 వద్ద మొదలైంది. 60,094 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,437 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 235 పాయింట్ల లాభంతో 60,392 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,722 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,759 వద్ద ఓపెనైంది. 17,717 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,825 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 90 పాయింట్లు పెరిగి 17,812 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,426 వద్ద మొదలైంది. 41,332 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,610 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 191 పాయింట్లు పెరిగి 41,557 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐచర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సెమ్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.61,310గా ఉంది. కిలో వెండి రూ.750 పెరిగి రూ.77,350 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.26,390 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
#MoneyMindedMalini Episode #2 is here.
— NSE India (@NSEIndia) April 3, 2023
Username and password are like your security guards, and SMS notifications are like CCTV cameras of your trading account. To know more watch this video.#SochKarSamajhKarInvestKar #InvestorAwareness #StockMarket@ashishchauhan… pic.twitter.com/97qlh7Qogc
Don't fall for unsolicited stock tips promising assured/guaranteed returns in stock market. Be a smart investor https://t.co/6EIJrMfdyF#unsolicitedstocktips #AssuredReturns #FixedReturns #GuaranteedReturns #StockMarket #InvestorAwareness #NSEIndia @ashishchauhan pic.twitter.com/lxatEwM2Jt
— NSE India (@NSEIndia) April 12, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం