By: ABP Desam | Updated at : 10 Apr 2023 03:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 10 April 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల్లో ట్రేడయ్యాయి. స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 24 పాయింట్లు పెరిగి 17,624 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 13 పాయింట్లు పెరిగి 59,846 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా బలహీనపడి 81.89 వద్ద స్థిరపడింది. రియాల్టీ షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,832 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,858 వద్ద మొదలైంది. 59,766 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,109 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 13 పాయింట్ల లాభంతో 59,846 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,599 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,634 వద్ద ఓపెనైంది. 17,597 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,694 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 24 పాయింట్లు పెరిగి 17,624 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 41,116 వద్ద మొదలైంది. 40,727 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 206 పాయింట్లు తగ్గి 40,834 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్, విప్రో షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యునీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఐటీ, మెటల్, రియాల్టీ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.430 తగ్గి రూ.60,430గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.76,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.26,410 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In today's #StockTerm, let's look at what Equity Securities are!#NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #EquitySecurities pic.twitter.com/8fv50EnhTY
— NSE India (@NSEIndia) April 10, 2023
Can you spot the names of three listed companies in the Food and Beverage sector? Write your answers in the comments.#NSECrossword #Crossword #ShareMarket #StockMarket #NIFTY50 #Investor pic.twitter.com/T98Z9yVykk
— NSE India (@NSEIndia) April 9, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్