By: ABP Desam | Updated at : 09 Dec 2022 03:49 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 09 December 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని, ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతాయన్న భయంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 117 పాయింట్ల నష్టంతో 18,492 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 389 పాయింట్ల లాభంతో 62,181 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలపడి 82.27 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 946 పాయింట్లు పతనమైంది.
BSE Sensex
క్రితం సెషన్లో 62,570 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,690 వద్ద మొదలైంది. 61,889 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,735 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 389 పాయింట్ల నష్టంతో 62,181 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 18,609 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,662 వద్ద ఓపెనైంది. 18,410 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,664 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 117 పాయింట్ల నష్టంతో 18,492 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా లాభపడింది. ఉదయం 43,765 వద్ద మొదలైంది. 43,361 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,361 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 44 పాయింట్లు ఎగిసి 43,641 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా, సన్ ఫార్మా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, విప్రో, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు భారీగా పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stock Market News: హమ్మయ్య! పతనం ఆగింది - కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ!
Stock Market News: ఫ్లాట్‌గా మొదలైన నిఫ్టీ, సెన్సెక్స్ - అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ గెయినర్!
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు భారీ ఊరట, ఇకపై ఒకరోజు ముందే ఖాతాలోకి డబ్బు
Stock Market Crash: రక్తమోడుతున్న స్టాక్ మార్కెట్లు - లక్షల కోట్ల నష్టంతో ఇన్వెస్టర్ల కన్నీరు!
Stock Market News: చల్లారని అదానీ హిండెన్ బర్గ్ కుంపటి - పతనం దిశగా స్టాక్ మార్కెట్లు!
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్