search
×

Stock Market Today: నవ్విన మదుపరి! భారీగా లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing 05 October 2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. రెండు రోజుల వరుస పతనానికి తెరపడింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 05 October 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. రెండు రోజుల వరుస పతనానికి తెరపడింది. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 109 పాయింట్లు పెరిగి 19,545 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 405 పాయింట్లు ఎగిసి 65,631 వద్ద ముగిశాయి. ఫైనాన్స్‌, బ్యాంకు షేర్లు పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,226 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,598 వద్ద మొదలైంది. 65,443 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,753 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 405 పాయింట్లు పెరిగి 65,631 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,436 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,521 వద్ద ఓపెనైంది. 19,487 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,576 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 109 పాయింట్లు పెరిగి 19,545 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 44,181 వద్ద మొదలైంది. 44,108 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,108 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 249 పాయింట్ల లాభంతో 44,213 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఆటో (2.15%), ఎల్‌టీ (2.06%), ఎం అండ్‌ ఎం (1.76%), టైటాన్‌ (1.64%), టీసీఎస్‌ (1.48%) షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌ (1.21%), హిందాల్కో (0.49%), ఎన్టీపీసీ (0.40%), సిప్లా (0.1540%), నెస్లే ఇండియా (0.38%) నష్టపోయాయి. మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 తగ్గి రూ.57,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.70,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.23,250 వద్ద ఉంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్లోనూ పతనం కొనసాగింది. క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ ఇండెక్స్‌, వినియోగ ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంటు పెంచాయి. వీటికి తోడు ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ముఖ్యంగా బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లు విలవిల్లాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 92 పాయింట్లు తగ్గి 19,436 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 286 పాయింట్లు తగ్గి 65,226 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 05 Oct 2023 04:04 PM (IST) Tags: Nifty Stock Market Sensex

ఇవి కూడా చూడండి

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ

Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ

Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్

Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్

Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?

Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?

FIFA World Cup 2026 : FIFA ప్రపంచ కప్ 2026 సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?

FIFA World Cup 2026 : FIFA ప్రపంచ కప్ 2026  సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy