By: ABP Desam | Updated at : 01 Mar 2023 03:51 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 01 March 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఎనిమిది రోజులు వరుస నష్టాలకు తెరపడింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. జీడీపీ గణాంకాలు విడుదల అవ్వడం, తయారీ రంగం స్థిరంగా ఉండటం మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటు పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 146 పాయింట్లు పెరిగి 17,450 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 448 పాయింట్లు ఎగిసి 59,411 వద్ద ముగిశాయి. అదానీ షేర్లు దూకుడు ప్రదర్శించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు లాభపడి 82.50 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 58,926 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,136 వద్ద మొదలైంది. 59,109 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,475 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 448 పాయింట్ల లాభంతో 59,411 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,303 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,360 వద్ద ఓపెనైంది. 17,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,467 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 146 పాయింట్లు పెరిగి 17,450 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ భారీగా లాభపడింది. ఉదయం 40,473 వద్ద మొదలైంది. 40,341 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 429 పాయింట్లు పెరిగి 40,698 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 45 కంపెనీలు లాభాల్లో 5 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, యూపీఎల్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, బ్రిటానియా, సిప్లా, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు భారీగా లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.170 పెరిగి రూ.56,290 గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.25,410 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations to State Bank of India (@TheOfficialSBI) for completing 28 years of #listing at #NSE.#Listed #ListingAnniversary #Nifty50 #Nifty50Companies #ShareMarket #StockMarket @ashishchauhan pic.twitter.com/IehHe48SNx
— NSE India (@NSEIndia) March 1, 2023
In today's #StockTerm let's look at what Liquidity is! Share if you found this post helpful. #NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #Liquidity pic.twitter.com/0oP8T3fVZp
— NSE India (@NSEIndia) February 28, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత