search
×

Stock Market Today: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ - పీఎస్‌యూ బ్యాంకు షేర్ల జోష్‌

Stock Market at 12PM, 14 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market at 12PM, 14 September 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అమెరికా ద్రవ్యోల్బణం కొంత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 29 పాయింట్లు పెరిగి 20,099 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 59 పాయింట్లు పెరిగి 67,526 వద్ద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు సూచీలకు అండగా ఉన్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 67,466 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,627 వద్ద మొదలైంది. 67,407 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,771 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 59 పాయింట్ల లాభంతో 67,526 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 20,070 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 20,125 వద్ద ఓపెనైంది. 20,062 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,167 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 29 పాయింట్లు పెరిగి 20,099 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 46,013 వద్ద మొదలైంది. 45,801 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,153 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 89 పాయింట్ల లాభంతో 45,998 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, యూపీఎల్‌, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. ఏసియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పెరిగాయి. 

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.24,000 వద్ద ఉంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడ్డారు. చివరికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 3 పాయింట్లు తగ్గి 19,993 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 94 పాయింట్లు తగ్గి 67,221 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లు జోరుమీదున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 14 Sep 2023 12:26 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?

CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?

Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్

Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్

Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు

Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు

Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?

Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy