By: Swarna Latha | Updated at : 04 May 2024 05:33 PM (IST)
ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడికి ఈటీఎఫ్- మ్యూచువల్ ఫండ్స్‌లో ఏదీ బెటర్ ?
ETF Vs Mutual Funds: కరోనా సమయంలో చాలా మంది ఇంటి వద్ద నుంచే డబ్బు సంపాదించాలని భావించారు. ఈ క్రమంలోనే చాలా మంది నవతరానికి చెందిన వారు స్టాక్ మార్కెట్లను సైడ్ ఇన్కమ్ ఆప్షన్ కింద ఎంచుకున్నారు. అయితే స్టాక్ మార్కెట్లలో లాభాలు సంపాదించే వారి కంటే నష్టపోయేవారు ఎక్కువగా ఉంటుంటారు. దీనికి కారణం స్టాక్ మార్కెట్ల పనితీరుపై సరైన అవగాహన లేకపోవటమే. అయితే నష్టపోయిన చాలా మంది చివరికి మార్కెట్లను ఒక జూదంగా చెబుతుంటారు. కానీ మార్కెట్లు ఏఏ అంశాల ఆదారంగా పనిచేస్తాయి.. వాటి పరిమితులను లోతుగా స్టడీ చేయాల్సి ఉంటుంది.
కానీ వీటన్నింటితో మాకు సంబంధం లేదు అయినా మాకు బ్యాంక్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడి కావాలనుకునే వారికి ఉత్తమమైన ఎంపిక మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది మార్కెట్లో ఉండే వందలాది ఫండ్స్ నుంచి మీ అవసరాలకు అనుగుణంగా సరైన వాటిని ఎంచుకోవాలి. ఇక్కడ ఫండ్ గత పనితీరు, ఎక్స్ పెన్స్ రేషియో, మార్కెట్లు కుప్పకూలినప్పుడు రక్షణ, ఫండ్ మేనేజర్ పనితీరు, ఫండ్ రాబడులు వంటి చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటిపై అవగాహన లేకపోయిన మంచి రాబడులను తెచ్చిపెట్టేవి ఇండెక్స్ ఫండ్స్. ఇది సెన్సెక్స్ లోని స్టాక్స్ పనితీరు ఆదారంగా రాబడును అందిస్తుంటుంది.
ఈటీఎఫ్స్ కొనుగోలు..
బెంచ్ మార్క్ ఇండెక్స్‌లో పెట్టుబడులు నేరుగా పెట్టేందుకు ఉన్న ఉత్తమమైన ఎంపిక ఈటీఎఫ్స్ అని చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్ల నుంచి సెన్సెక్స్ ఈటీఎఫ్స్ కొనటం ద్వారా మధ్యవర్తులు లేకుండా నేరుగా పెట్టుబడిదారులను చేయవచ్చు. ఇక్కడ పెట్టుబడి ద్వారా మార్కెట్లు పడిపోయిన ప్రతిసారి మన వద్ద ఉన్న డబ్బును అనువుగా ఈటీఎఫ్స్ కొనటం మంచి రాబడిని దీర్ఘకాలంలో అందిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ సహజంగా 12-16 శాతం మధ్యలో రాబడులను అందిస్తున్నట్లు గత మార్కెట్ల డేటా చెబుతోంది.
ఒక అంచనా ప్రకారం ఎవరైనా ఇన్వెస్టర్ ఏకకాలంలో లక్ష రూపాయలు సెన్సెక్స్ ఈటీఎఫ్ లో పెట్టుబడిగా పెట్టి 31 సంవత్సరాలు దానిని కొనసాగిస్తే దాని విలువ రాబడి కాంపౌండింగ్ ప్రకారం రూ.కోటిగా మారుతుందని వెల్లడైంది. అంటే కేవలం లక్ష పెట్టుబడితో కూడా మనం కోటీశ్వరులుగా మారవచ్చని గుర్తుంచుకోండి. పైగా వీటిని ఇంట్రాడేలో కొనటం అమ్మటం ద్వారా చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలను పొందుతుంటారు.
మ్యూచువల్ ఫండ్ SIP పెట్టుబడులు..
చిన్న వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ ప్రతినెల తమ డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీ రూపంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ మార్గం మంచి రాబడులను అందిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినప్పుడు ఈటీఎఫ్ మాదిరిగా నేరుగా కొనకపోవటం వల్ల ఫండ్ హౌస్ కు ఎక్స్ పెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. పైగా తక్కువ మెుత్తంలో ప్రతినెల క్రమపద్ధతిలో కొనుగోలు చేయటం కంటే ఏకకాలంలో పెట్టుబడిపైనై అధిక రాబడి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఇక్కడ ఇండెక్స్ ఫండ్స్ విక్రయించాలంటే కూడా సమయం పడుతుంది. అలా కాకుండా ఇండెక్స్ ఈటీఎఫ్స్ కొనుగోలు చేసినట్లయితే వాటిని డీమ్యాట్ ఖాతాలో ఉన్నందున ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. లేదా అత్యవసర పరిస్థితుల్లో వాటిని బ్రోకరేజ్ సంస్థ వద్ద తనఖా పెట్టి డబ్బును సైతం పొందవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో తనఖాపెట్టి డబ్బు పొందటం కొంచెం క్లిష్టమైన ప్రక్రియను కలిగి ఉంటుంది.
ఇలా రెండింటిలోనూ ఉన్న ప్రయోజనాలు, సమస్యలను పరిశీలించి పెట్టుబడిదారులు తమ ఆర్థిక పరిస్థితులకు అనుకూలమైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రెండింటిలోనూ ఒకేరకమైన ప్రయోజనాలు, రక్షణ ఉన్నప్పటికీ డబ్బు అందుబాటులో ఉండటంతో పాటు ఇతర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగటం ఉత్తమమని గుర్తుంచుకోండి.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్