By: ABP Desam | Updated at : 14 Sep 2022 03:22 PM (IST)
Edited By: Arunmali
సిసలైన మల్టీబ్యాగర్ స్టాక్
Jyoti Resins Adhesives Shares: బుధవారం నాటి బలహీనమైన మార్కెట్‌లోనూ కొత్త గరిష్ట స్థాయిని తాకి, అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయి మీసం మెలేసింది జ్యోతి రెజిన్స్ & అథీసివ్స్ (Jyoti Resins & Adhesives) స్టాక్.
బుధవారం ఇంట్రా డే ట్రేడ్‌లో, 5 శాతం పెరిగిన ఈ షేరు రూ.1,769.70 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో ఆగిపోయింది. ఇలా అప్పర్ సర్క్యూట్ కొట్టడం ఇది వరుసగా ఐదో ట్రేడింగ్ రోజు. ఈ ఐదు రోజుల్లోనే ఈ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ కౌంటర్ 27 శాతం పెరిగింది.
ఈ నెల 8న, 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లకు ఎక్స్ డేట్ ముగిసింది. అంటే ఈ కంపెనీలో ఒక షేర్‌హోల్డర్ హోల్డ్ చేసే ప్రతి 1 షేర్‌కి 2 బోనస్ షేర్లు వచ్చి యాడ్ అయ్యాయి.
గత ఐదు వారాల్లోనే, ఈ స్క్రిప్ రూ.858 (బోనస్ ఇష్యూ ప్రకారం సర్దుబాటు చేసిన తర్వాతి ధర) నుంచి 106 శాతం పైగా లేదా రెట్టింపు జూమ్ అయింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌లో 3.8 శాతం పెరిగింది.
సంవత్సరంలో 527 శాతం జూమ్
జ్యోతి రెజిన్స్ & అథీసివ్స్ షేరులో పెట్టుబడి పెట్టినవాళ్లు ఏడాదంతా పండగ చేసుకుంటున్నారు. ఈ షేరు ధర గత ఆరు నెలల్లో 193 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 373 శాతం, గత ఒక సంవత్సర కాలంలో ఏకంగా 527 శాతం పెరిగింది. మల్టీ బ్యాగర్‌కు మారుపేరుగా నిలిచింది.
'XT' గ్రూప్ క్రింద ట్రేడ్
ప్రస్తుతం, జ్యోతి రెజిన్స్ & అథీసివ్స్ షేర్లు 'XT' గ్రూప్ క్రింద ట్రేడ్ అవుతున్నాయి. XT గ్రూప్ అంటే BSEలో మాత్రమే లిస్టయిన కంపెనీ. దీనిలో ఒక్కో షేరును విడిగా కొనడానికి వీలవదు. ట్రేడ్ టు ట్రేడ్ ప్రాతిపదిక ఉంటుంది. ఈ కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా మితంగానే ఉంటుంది. మొత్తం ట్రేడింగ్ టర్నోవర్‌కు నామమాత్రంగా కాంట్రిబ్యూట్ చేస్తాయి. పెట్టుబడిదారులు ఇలాంటి స్టాక్స్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (Q1FY23), అన్ని విభాగాల్లో బలమైన వృద్ధిని జ్యోతి రెజిన్స్ & అథీసివ్స్ నమోదు చేసింది. YoY ప్రాతిపదికన ఆదాయం, ఎబిటా (EBITDA), పన్ను తర్వాతి లాభం (PAT) వరుసగా 137 శాతం, 174 శాతం, 151 శాతం చొప్పున పెరిగాయి.
'EURO 7000' బ్రాండ్ పేరుతో వాటర్ ప్రూఫ్, యాంటీ టెర్మైట్ ఫాస్ట్ డ్రైయింగ్, వెదర్ ప్రూఫ్, యాంటీ ఫంగల్ అథీసివ్స్ వంటి విభిన్న ఫార్ములేషన్లతో వివిధ రకాల ఉడ్ అథీసివ్స్‌ను ఈ కంపెనీ తయారు చేసి అమ్ముతోంది. కంపెనీ ప్రధాన కార్యాలయాలు అహ్మదాబాద్, ముంబైలో ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అంతటా కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు కనిపిస్తాయి.
గత 7 సంవత్సరాల్లో, 38 శాతం CAGR వద్ద ఈ కంపెనీ వృద్ధి చెందింది. ఆదాయం 73 శాతం CAGR వద్ద, ఎబిటా, ప్యాట్ కలిపి 115 శాతం CAGR వద్ద పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారు!
Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ