By: ABP Desam | Updated at : 28 Apr 2023 10:06 AM (IST)
రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన అంతంతమాత్రం
Mankind Pharma IPO: గత ఏడాది కాలంలో అతి పెద్ద పబ్లిక్ ఆఫర్ అయినా మ్యాన్‌కైండ్ ఫార్మా IPO కోసం సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసింది. దేశీయ ఔషధ తయారీ కంపెనీల (Pharma) రంగంలో, 2020లో వచ్చిన ₹6,480 కోట్ల గ్లాండ్ ఫార్మా IPO తర్వాత అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ మ్యాన్‌కైండ్ ఫార్మా IPO. ₹4,326 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ కంపెనీ పబ్లిక్‌లోకి వచ్చింది.
గత మంగళవారం (25 ఏప్రిల్ 2023) నాడు సబ్‌స్క్రిప్షన్స్ కోసం IPO ఓపెన్ అయింది. బిడ్డింగ్ చివరి రోజైన గురువారం (27 ఏప్రిల్ 2023) నాటికి ఈ ఇష్యూ 15.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. IPO ద్వారా 28 మిలియన్ షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తే, 429.5 మిలియన్ ఈక్విటీ షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి.
పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో వచ్చిన IPOలో, ₹1,024-1,080 ప్రైస్ బ్యాండ్‌లో షేర్లను విక్రయించారు.
రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన అంతంతమాత్రం
అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్ల (QIB) వాటా 49 రెట్ల సభ్యత్వం దక్కించుకుంది. సంస్థాగతేతర పెట్టుబడిదార్లు లేదా అధిక నికర విలువగల పెట్టుబడిదార్ల భాగానికి (HNI) 3.8 రెట్ల స్పందన వచ్చింది. అయితే... రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జారీ చేసిన పోర్షన్ మాత్రం పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాలేదు, 92% వద్ద ఆగిపోయింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు బాగా లేకపోవడం, ప్రైస్ బ్యాండ్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడం దీనికి కారణం.
IPO ప్రైస్ బ్యాండ్ గరిష్ట ధర ₹1,080 వద్ద... FY22 ఆదాయాలకు PE రేషియో 30 రెట్లుగా ఉంది, ₹44,000 కోట్ల మార్కెట్ విలువను (market capitalisation) ఈ కంపెనీ కమాండ్ చేస్తోంది. IPO తర్వాత, కంపెనీలో ప్రమోటర్ వాటా 78% శాతానికి తగ్గుతుంది, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదార్ల షేర్ 12%కు చేరుతుంది.
మ్యాన్‌కైండ్ ఫార్మా ఆఫర్‌లో ఉన్న కొంతమంది విక్రయదారులలో ప్రమోటర్లు రమేష్ జునేజా, రాజీవ్ జునేజా మరియు శీతల్ అరోరా మరియు పెట్టుబడిదారులు కెయిర్న్‌హిల్ CIPEF, కెయిర్న్‌హిల్ CGPE, బీజ్ లిమిటెడ్ మరియు లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఉన్నారు.
IPOకి ముందు, 77 యాంకర్ ఇన్వెస్టర్లకు 12 మిలియన్ ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా దాదాపు ₹1,297 కోట్లను మ్యాన్‌కైండ్ సమీకరించింది.
టైమ్ లైన్
– IPO షేర్ల కేటాయింపు: మే 3, 2023
– రీఫండ్‌ల ప్రారంభం: మే 4, 2023
– డీమ్యాట్ ఖాతాకు షేర్ల క్రెడిట్: మే 8, 2023
– IPO షేర్ల లిస్టింగ్ తేదీ: మే 9, 2023
ఆర్థికాంశాలు
కంపెనీ ఆదాయం 15.2% CAGR వద్ద, FY20లోని ₹5,865 కోట్ల నుంచి FY22లో ₹7,782 కోట్లకు పెరిగింది. మొత్తం ఫార్మా మార్కెట్ వృద్ధి కంటే 1.5 రెట్లు అధికం. అదే సమయంలో నికర లాభం 17.3% CAGR వద్ద, ₹1,056 కోట్ల నుంచి ₹1,453 కోట్లకు పెరిగింది. 2022 డిసెంబర్ నెలతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి ₹ 6,697 కోట్ల ఆదాయాన్ని, ₹1,016 కోట్ల నికర లాభం, 22.3% ఎబిటా మార్జిన్, 16.6% RoCEని నమోదు చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!