search
×

IPO: మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఐపీవో ప్రారంభం, లిస్టింగ్‌ వరకు ఆగమంటున్న ఎక్స్‌పర్ట్‌లు

ఒక్కో షేరుకు రూ. 1,026 నుంచి రూ. 1,080 ధరను ప్రైస్‌ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది.

FOLLOW US: 
Share:

Mankind Pharma IPO: దేశీయ విక్రయాల పరంగా నాలుగో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ, దిల్లీకి చెందిన మ్యాన్‌కైండ్ ఫార్మా ₹4,326 కోట్ల IPO సబ్‌స్క్రిప్షన్ నేటి నుంచి ప్రారంభమైంది, 27వ తేదీ (గురువారం) వరకు ఓపెన్‌లో ఉంటుంది. 

ఒక్కో షేరుకు రూ. 1,026 నుంచి రూ. 1,080 ధరను ప్రైస్‌ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. 

ఇది పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ఆఫర్. ప్రస్తుత పెట్టుబడిదార్లు, ప్రమోటర్లు తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయిస్తున్నారు, నాలుగు కోట్లకు పైగా (4,00,58,844) షేర్లను మార్కెట్‌లో అమ్మకానికి పెడుతున్నారు.

IPOలో షేర్లు కొనాలంటే లాట్ల రూపంలో బిడ్స్‌ వేయాలి. ఒక్కో లాట్‌కు 13 షేర్లను కంపెనీ కేటాయించింది. ప్రైస్‌ బ్యాండ్‌ గరిష్ట ధర ‍(రూ. 1,080) ప్రకారం, ఒక్కో లాట్‌కు గరిష్టంగా రూ. 14,040 ఖర్చవుతుంది.

టైమ్‌ లైన్‌
–  IPOలో బిడ్స్‌ విన్‌ అయిన వాళ్లకు షేర్ల కేటాయింపు: మే 3, 2023
–  రీఫండ్‌ల ప్రారంభం: మే 4, 2023
–  డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల క్రెడిట్: మే 8, 2023
–  IPO షేర్ల లిస్టింగ్‌ తేదీ: మే 9, 2023

వ్యాపారం
హెల్త్‌ కేర్ రంగంలో అతి పెద్ద ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్స్‌లో (IPO) ఇది ఒకటి. సహచర కంపెనీలకు భిన్నంగా, మ్యాన్‌కైండ్ ఫార్మా గ్రామీణ భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు పట్టణాలకు విస్తరిస్తోంది. కంపెనీ ఆదాయాలలో 97% భారతదేశం నుంచే సంపాదిస్తోంది. బ్రాండెడ్ వినియోగదారు ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలను నిర్మించడంలో ఇది ప్రత్యేకంగా విజయవంతమైన ప్లేయర్‌గా కూడా ఉంది. వివిధ సెగ్మెంట్లలో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. జనాల్లో బాగా పాపులర్ అయిన మ్యాన్‌ఫోర్స్‌ కండోమ్స్‌ (Manforce condoms), ప్రెగా న్యూస్‌తో (Prega-news‌), అన్‌వాంటెడ్-72 (Unwanted-72) దీని ఉత్పత్తులే. 15,000 మందికి పైగా మార్కెటింగ్ ప్రతినిధులు & నిర్వాహకులతో, దేశంలోని 80% మంది వైద్యుల నెట్‌వర్క్‌తో భారతీయ ఫార్మా పరిశ్రమలో అతి పెద్ద ఫీల్డ్ ఫోర్స్‌ల్లో మ్యాన్‌కైండ్ ఒకటి.

ఆర్థికాంశాలు
కంపెనీ ఆదాయం 15.2% CAGR వద్ద, FY20లోని ₹5,865 కోట్ల నుంచి FY22లో ₹7,782 కోట్లకు పెరిగింది. మొత్తం ఫార్మా మార్కెట్ వృద్ధి కంటే 1.5 రెట్లు అధికం. అదే సమయంలో నికర లాభం 17.3% CAGR వద్ద, ₹1,056 కోట్ల నుంచి ₹1,453 కోట్లకు పెరిగింది. 2022 డిసెంబర్‌ నెలతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి ₹ 6,697 కోట్ల ఆదాయాన్ని, ₹1,016 కోట్ల నికర లాభం, 22.3% ఎబిటా మార్జిన్, 16.6% RoCEని నమోదు చేసింది.

వృద్ధి అవకాశాలు 
ఎక్కువ మార్జిన్, అధిక వృద్ధి సామర్థ్యాన్ని ఇచ్చే దీర్ఘకాలిక చికిత్సల విభాగాలపై దృష్టిని పెంచుతోంది. ఇందులో భాగంగా, గత సంవత్సరం పనాసియా బయోటెక్ దేశీయ ఫార్ములేషన్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది.

వాల్యుయేషన్స్
కంపెనీ FY23 ఆదాయాలకు 32.5 రెట్ల విలువ వద్ద IPO తీసుకువచ్చారు. ఈ ఇష్యూ తర్వాత కంపెనీ మార్కెట్‌ విలువ ₹43,200 కోట్లకు చేరుతుంది. ఇది, కంపెనీ FY23 ఆదాయాల కంటే దాదాపు 4.8 రెట్లు ఎక్కువ విలువతో ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీకి ఇవి సహేతుకమైన విలువలు.

ఆందోళనలు
కంపెనీ వ్యాపార అవకాశాలపై కొన్ని ఆందోళనలు ఉన్నాయి. భారతీయ మార్కెట్‌లోని టాప్‌-5లో ఒకటిగా ఉన్నప్పటికీ, పోటీ కంపెనీలు సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా వంటి లిస్టెడ్ ఫార్మాల కంటే ఈ కంపెనీ చిన్నది.

దేశంలోని గ్రామీణ & సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో వేగంగా, దూకుడుగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ... దీర్ఘకాలిక చికిత్సల్లో, మెట్రోలు, టైర్ 1 నగరాలు, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించడం కంపెనీకి అంత తేలికైన పని కాదు, అధిక పోటీ ఉంది.  R&Dపై తోటి కంపెనీలు చేస్తున్న ఖర్చు కంటే ఈ కంపెనీ చేస్తున్న వ్యయం తక్కువ, ఆదాయంలో 2.3% మాత్రమే ఖర్చు పెడుతోంది. 

అంతేకాదు... ఫార్మా పోర్ట్‌ఫోలియో లాభదాయకతను నిర్ణయించడంలో కీలకమైన వినియోగదారు ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో ఆదాయాలు & మార్జిన్‌లను ఈ కంపెనీ వెల్లడించలేదు. 

లిస్టింగ్‌ తర్వాత మంచి ఎంట్రీ పాయింట్‌
దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం, IPO లిస్టింగ్‌ తర్వాత ఈ స్టాక్‌లో మంచి ఎంట్రీ పాయింట్‌ దొరుకుతుందన్నది మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 25 Apr 2023 09:27 AM (IST) Tags: IPO Price Band Mankind Pharma IPO dates

సంబంధిత కథనాలు

Nexus IPO: కేవలం 3% లాభంతో లిస్ట్‌ అయిన నెక్స్‌స్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌, ఇది ఊహించినదే!

Nexus IPO: కేవలం 3% లాభంతో లిస్ట్‌ అయిన నెక్స్‌స్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌, ఇది ఊహించినదే!

Nexus Trust: నెక్సస్‌ ట్రస్ట్‌ IPO ప్రారంభం, బిడ్‌ వేసే ముందు బుర్రలో పెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు

Nexus Trust: నెక్సస్‌ ట్రస్ట్‌ IPO ప్రారంభం, బిడ్‌ వేసే ముందు బుర్రలో పెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు

Mankind Pharma: లాభాల పంట పండించిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా, 20% లిస్టింగ్‌ గెయిన్స్‌

Mankind Pharma: లాభాల పంట పండించిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా, 20% లిస్టింగ్‌ గెయిన్స్‌

IPO: టాటా టెక్నాలజీస్ ఐపీవో షేర్‌ ధర, గ్రే మార్కెట్‌ ట్రెండ్‌ ఎలా ఉందో తెలుసుకోండి

IPO: టాటా టెక్నాలజీస్ ఐపీవో షేర్‌ ధర, గ్రే మార్కెట్‌ ట్రెండ్‌ ఎలా ఉందో తెలుసుకోండి

Tata Play IPO: ఐపీవో పేపర్‌ను గోప్యంగా దాఖలు చేసిన టాటా ప్లే, ఎందుకింత రహస్యం?

Tata Play IPO: ఐపీవో పేపర్‌ను గోప్యంగా దాఖలు చేసిన టాటా ప్లే, ఎందుకింత రహస్యం?

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!