ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అదరగొట్టింది! 2021, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.5,809 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలోని రూ.5197తో పోలిస్తే ఇది 11.8 శాతం పెరగడం గమనార్హం. ఆపరేషన్స్ రాబడి వార్షిక ప్రాతిపదికన 22.91 శాతం పెరిగి రూ.31,867 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఇంతకు ముందు ఇది రూ.25,927 కోట్లుగా ఉంది.
ఇన్ఫోసిస్ 2022, ఆర్థిక ఏడాదికి రాబడి మార్గదర్శకాలను 19.5-20 శాతానికి పెంచింది. ప్రస్తుతం ఇది 16.5-17.5 శాతంగా ఉంది. చివరి క్వార్టర్లో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ త్రైమాసికంలో మాత్రం మంచి ఫలితాలు సాధించామని కంపెనీ వెల్లడించింది. ఒప్పందాలు పెరగడం, అంతర్జాతీయంగా భారీ సంస్థలు డిజిటలైజేషన్ వైపు పయనిస్తుండటంతో మూమెంటమ్ పెరిగిందని పేర్కొంది.
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
'డిజిటలైజేషన్ వైపునకు కంపెనీలు అడుగులు వేసేందుకు మా సాయం తీసుకుంటున్నాయి. ఫలితాలు, మార్కెట్లో మా వాటా పెరుగుదల దానినే సూచిస్తోంది. భారీ కంపెనీలు సాంకేతికతపై ఇలాగే దృష్టి కొనసాగిస్తారని మేం ఆశిస్తున్నాం' అని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలిల్ పరేఖ్ అన్నారు. 'ప్రాథమికంగా సరఫరా వైపు నుంచి ధరల పెరుగుదల వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మేం ఆరోగ్యకరమైన లాభాలనే ఆర్జించాం. నిధులను సమర్థంగా వినియోగించడం, ఆపరేటింగ్ లివరేజ్ ఇందుకు దోహదం చేశాయి' అని ఆయన వివరించారు.
భారీ ఒప్పందాలు కుదరడంతో మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మొత్తం ఒప్పందాల విలువ (TCV) 2.53 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఆపరేటింగ్ మార్జింగ్ 23.5 శాతం, క్యాష్ ఫ్లో కన్వర్షన్ 92.6 శాతంగా ఉంది. ఇక ఇపరేటింగ్ మార్జింగ్ ఈ క్వార్టర్లో 23.5 శాతంగా ఉంది. మొత్తం ఆదాయంలో ఇన్ఫోసిస్ డిజిటల్ వాటా 58.5 శాతంగా ఉంది.
Also Read: ITR Filing Date Extended: టాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్! మార్చి 15 వరకు గడువు పెంపు
Also Read: Vodafone Idea Shareholders: వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!