కొత్త సంవత్సరంలో వస్తు సేవల పన్ను రేట్లు, అమలు విధానంలో కొన్ని మార్పులు రానున్నాయి. జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌ వేదికలు నిక్కచ్చిగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. యాప్‌ల ద్వారా ఆటో, క్యాబ్‌లు బుక్‌ చేసుకుంటే, ఆహారం తెప్పించుకుంటే సంబంధిత వేదికలే జీఎస్‌టీ కట్టాలి. ఫుట్‌వేర్‌, టెక్స్‌టైల్‌ రంగాల్లోన పన్ను చెల్లింపుల విధానం మారింది. ధరలతో సంబంధం లేకుండా వస్త్రాలు, ఫుట్‌వేర్‌పై 12 శాతం వరకు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.


ఇప్పటి వరకు ఉబెర్‌, ఓలా వంటి వేదికల ద్వారా ప్రయాణికులు బుక్‌ చేసుకుంటే పన్ను ఉండేది కాదు. ఇకపై ఈ వేదికల ద్వారా వాహనాలు ఎంపిక చేసుకొని ప్రయాణిస్తే జనవరి 1 నుంచి ఐదు శాతం జీఎస్‌టీ పడుతుంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లపైనా ఇదే వర్తించనుంది. స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌ల ద్వారా ఆహారం తెప్పించుకుంటే రెస్టారెంట్లకు బదులు ఈ వేదికలే ఐదు శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఈ భారం కస్టమర్‌పై ఉండదు. గత రెండేళ్లలో ఫుడ్‌ అగ్రిగేటర్లు రూ.2000 కోట్ల వరకు పన్ను తక్కువ చేసి చూపించడమే దీనికి కారణం.


ఇకపై పన్ను ఎగవేత దారులపై తీవ్ర చర్యలు ఉండబోతున్నాయి. కొత్త సంవత్సరం నుంచి జీఎస్‌టీ రీఫండ్‌ క్లెయిమ్‌ చేసుకోవాలంటే ఆధార్‌తో తప్పనిసరిగా అథెంటికేషన్‌ చేయాలి. వ్యాపారులు పన్నులు చెల్లించకపోతే, గత నెల జీఎస్‌టీఆర్‌-3బిని వెంటనే ఫైల్‌ చేయకపోతే రీఫండ్‌ను నిలిపివేస్తారు. కొత్త ఏడాది నుంచి  పన్ను వసూలు చేసేందుకు జీఎస్‌టీ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వ్యాపార కార్యాలయాలకు వెళ్లొచ్చు. విక్రేతలు నకిలీ బిల్లులతో ఎక్కువ ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం క్లెయిమ్‌ చేస్తుండటమే ఇందుకు కారణం.


Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.


Also Read: RBI Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఆన్‌లైన్‌ పేమెంట్‌ నిబంధన గడువులో మార్పు.. ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే?


Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!


Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!


Also Read: Cyber Crime: మీ మొబైల్‌ ఫోన్‌ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి


Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్‌ లిస్టింగ్‌ సూపర్‌హిట్‌.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?