అనంత రాజకీయాల్లో జేసీ కుటుంబం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల అనంతపురం టీడీపీలో జరగుతున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి జేసీ పవన్ గత మూడు నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే ప్రస్తుతం అనంతపురం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జేసీ పవన్ వర్గంగా ముద్రపడ్డ వారికి జిల్లా కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, శింగనమల ఇంచార్జ్ బండారు శ్రావణి విషయంలో టుమెన్ కమిటీని నియమించడం లాంటి విషయాలతో పవన్ కు, అధిష్టానానికి గ్యాప్ రావడానాకి ప్రధాన కారణంగా చెప్తున్నారు. జిల్లాలో పార్టీలో వుంటూ ప్రత్యర్థిగా వున్న ప్రబాకర్ చౌదరికి, తోడుగా కాలువ శ్రీనివాసులు ఇతర నేతలు కూడా జేసీ పవన్‌కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు.
జేసీ పవన్ విషయంలో యువనేతకు వ్యతిరేకవర్గం చెప్పిన మాటలకే విలువివ్వవడం, వారు చెప్పిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం, శింగనమల ఇంచార్జ్ కు సమానంగా టూమన్ కమిటీ వేయడం లాంటి విషయాలతో జేసీ వర్గం గుర్రుగా ఉంది. శింగనమల విషయంలో బండారు శ్రావణిని పిలుచుకుని స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరకు జేసీ దివాకర్ రెడ్డి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వీటన్నిటని గమనించే జెసి వర్గం పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. కళ్యాణదుర్గం ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు కూడా జెసి వర్గంలో ఉన్నప్పటకి జరుగుతున్న పరిణామాలను గమనించి ఆయన పయ్యావుల కేశవ్ ద్వారా జిల్లా నేతలతో రాజీకి వచ్చినట్లు చెప్పుకుంటన్నారు. ఈ పరిణామాల తరువాత కావాలనే తమ వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక జిల్లా నేతలు ఎలాగూ వారి రాజకీయం వారు చేస్తారు... కానీ గ్రౌండ్ లెవల్లో పార్టీ పటిష్ఠంగా వుండాలంటే ఎలాంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కనీస సమాచారం కూడా పార్టీ అధిష్ఠానం తీసుకోకుండా జిల్లాలో ఒకరిద్దరు నేతలు చెప్పిన వాటికే ప్రాధాన్యత ఇవ్వడాన్ని జెసి పవన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
నారా లోకేశ్ అనంతపురం పర్యటనలో కూడా జెసి పవన్ తో పాటు, ఆయన వర్గం కూడా ఎక్కడా పాల్గొనలేదు. అప్పట్లోనే వీటిపై కథనాలు కూడా వచ్చినప్పటికి త్వరలోనే సర్దుకుంటాయి అనుకొన్నారు. కానీ ఇప్పటికి అదిష్ఠానం... జేసీ పవన్ మధ్య అంతరం పెరుగుతూ పోతుందన్న భావనలో ఉన్నారు. కావాలనే ఈ గ్యాప్ ను పెంచేందుకు పార్టీలోనే ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. వారి వ్యూహాలను ఎపటికప్పుడు పసిగడుతూ తమ వర్గాన్ని ఏవిదంగా ముందుకు తీసుకెళ్లాలన్న వ్యూహాలను అమలు చేయాల్సిన పవన్ రెడ్డి ప్రస్తత మౌనం వెనుక ఉన్న కారణాలేంటన్నది జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరి రానున్న రోజుల్లో పార్టీలో ప్రత్యర్థుల వ్యూహాలకు భిన్నంగా జేసీ వర్గం ఏవిధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి. అంత ఈజీగా జేసీ కుటుంబం తన రాజకీయ ప్రత్యర్థులను తేలిక తీసుకోదన్నది అందరికీ తెలిసిందే. మరి అధిష్ఠానాన్ని ఏవిధంగా తనవైపు తిప్పుకుని, తన మాట వినేలా చేస్తారన్నది జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: CJI NV Ramana : సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు.. ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా ఆహ్వానించిన సీఎం జగన్ !
Also Read: నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ?
Also Read: Omicron Cases In AP: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ నిర్ధారణ