సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం ఇందిరా గాంధీ స్టేడియంలో తేనీటి విందు ఇచ్చింది. ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం తేనీటి విందు ఇవ్వాలని నిర్ణయించడంతో సీజేఐ ఎన్వీ రమణ అంగీకరించారు. ఈ మేరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ తేనీటి విందును ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ముందుగా సీఎం జగన్ సతీమణితో కలిసి నోవాటెల్ హోటల్లో బస చేసిన సీజేఐ ఎన్వీ రమణ వద్దకు వెళ్లి విందుకు ఆహ్వానించారు. 


Also Read: నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ?


క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని పులివెందుల నుంచి తాడేపల్లి వచ్చిన వెంటనే.. జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు నోవాటెల్‌కు వెళ్లారు. 
సీజేఐ ఎన్వీ రమణ గౌరవార్థం ఇచ్చిన తేనీటి విందు కోసం ముందుగానే సీఎం జగన్ స్టేడియానికి వచ్చారు. సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు స్వాగతం పలికారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు. మంత్రులందందరినీ సీఎం జగన్ సీజేఐకి పరిచయం చేసినట్లుగా తెలుస్తోంది. 


Also Read: సీజేఐకు హోమ్ టౌన్‌లో గ్రాండ్ వెల్క‌మ్.. ఎద్దుల బండిపై జస్టిస్‌ ర‌మ‌ణ‌ దంప‌తుల ఊరేగింపు..


ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌లు, హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు.  అంతకుముందు నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్‌ జగన్‌ మర్యాదపూర్వకంగా కలిసి, విందుకు ఆహ్వానించారు. కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్‌ నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు. 


Also Read: పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యం.. మరిన్ని కోర్సులు ప్రారంభించాలి.. సీజేఐ ఎన్వీ రమణ


Also Read: అప్పట్లో సినిమా రంగానిది బాధ్యతాయుతమైన పాత్ర.. నేటి తరం వాళ్లు సమీక్షించుకోవాలి


Also Read: రూల్ ఆఫ్ లా ముఖ్యం.. రాజ్యంగం, హక్కుల గురించి అందరూ తెలుసుకోవాలి.. సీజేఐ ఎన్వీ రమణ సందేశం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి