" ప్రభుత్వం, కార్యనిర్వాహక వర్గం చట్ట పరిధిలో పని చేస్తే కోర్టుకు రానవసరంలేదు. పరిధి దాటితే కోర్టులు జోక్యం చేసుకుంటాయి.. అది అవసరం కూడా. పౌర హక్కుల ఉల్లంఘన జరిగినా... ప్రశ్నించే తత్వం ప్రజల్లో ఉండాలి. నేడు రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం. అది లేకుంటే చాలా అలజడి రేగుతుంది. మేధావి వర్గంగా ఉన్న వారంతా ప్రజలకు రాజ్యాంగం, హక్కుల గురించి తెలియ చెప్పాలి..." అని సీజేఐ ఎన్వీ రమణ సందేశం ఇచ్చారు.
ఏపీ పర్యటనలో ఉన్న సీజేఐ ఎన్వీ రమణతురోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. ఈ కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగంపై పెద్ద చర్చ నడుస్తుంది. దీనిపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని సూచించారు.
Also Read: నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ?
భారత లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో లోప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. న్యాయ సహాయంకోసం, రాజ్యాంగ హక్కుల కోసం రోటరీ క్లబ్ సభ్యులు కొంత సమయం కేటాయించాలన్నారు. అన్ని వ్యవస్థల తరహాలో న్యాయ వ్యవస్థ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యతను మరచిపోతున్నాం. సమస్య వచ్చినా, హక్కులకు భంగం కలిగినా సామాన్య ప్రజలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలి. చిన్నవారు నుంచి పెద్ద వారువరకు అవగాహన పెంచుకోవాలి. నేటికీ సరైన అవగాహన ప్రజల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
4.60కోట్ల కేసులో మన దేశ న్యాయ స్థానాలలో ఉన్నాయి. కేసుల విచారణ సాగుతూ ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి. కోర్టుకు వచ్చిన వారికి న్యాయం చేయాలని భావిస్తున్నా. న్యాయమూర్తుల నియామకాలు, ఇతర ఇబ్బందులపై మాట్లాడుతూనే ఉన్నానన్నారు. విజయవాడతో ఎంతో అనుబంధం ఉందన్న సీజేఐ అనుకున్నంత అభివృద్ధి చెందలేదన్నారు. తెలుగుభాషను శిధిలం కాకుండా చూసుకోవాలి. ఇంగ్లీషు భాష నేర్చుకోండి... కానీ మాతృభాషతోనే అక్షరాలు దిద్దండి. మాతృభాషతోనే పునాది పటిష్ఠంగా ఉంటుందన్నారు.