మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడుకు ఆర్థిక వ్యవహారాలపై ఎంత పట్టు ఉంటుందో శాసనసభా వ్యవహారాలపైనా అంతే పట్టు ఉంటుంది. గతంలో శాసనమండలిలలో రాజధాని బిల్లుల సందర్భంగా ఆయన వ్యూహాలతోనే బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. ఇప్పుడు యమనల రామకృష్ణుడు.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మరో అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. అదే గ్రీన్ పేపర్. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తక్షణం గ్రీన్ పేపర్ రిలీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని యనమల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రెస్‌మీట్ పెట్టి వివరించారు. ఏపీ మొత్తం అప్పు రూ.7 లక్షల కోట్లకు చేరుతోందని... ఆర్థిక క్రమశిక్షణ గాలికొదిలేసి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆయన మండిపడ్డారు. గ్యారంటీలు 90% నుంచి 180 శాతానికి పెరిగిపోయాయని ఇకనైనా ఆర్థిక పరిస్థితిపై జగన్ రెడ్డి సమీక్ష నిర్వహించాలని చర్చ కోసం గ్రీన్‌పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సాధారణంగా రాజకీయాల్లో .. ప్రభుత్వాల్లో వైట్ పేపర్ లేదా శ్వేతపత్రం గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా అంశంపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ప్రభుత్వాలే విడుదల చేస్తూంటాయి. వైట్ పేపర్ అంటే.. ఓ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడం. ఉదాహరణకు ఆర్థిక పరిస్థితి గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తే... మొత్తంగా ఆదాయ, వ్యయాలు.. అప్పులు సహా మొత్తం ఏ - టూ జడ్ వివరించడం శ్వేతపత్రం రిలీజ్ చేయడం అంటారు . ఈ వివరాలన్ని చర్చలు, సంప్రదింపుల కోసం సిద్ధం చేసి విడుదల చేస్తే దాన్ని గ్రీన్ పేపర్ అంటారు.
వైట్ పేపర్‌లో ఆ వివరాలు విడుదల చేసి.. ఇదీ సంగతి అనిచెబుతారు. కానీ గ్రీన్ పేపర్ ద్వారా చర్చలు, సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది కాబట్టి ఇప్పుడు వైట్ పేపర్ వల్ల ప్రయోజనం లేదని.. గ్రీన్ పేపర్ ప్రకటించి.. పరిస్థితిని మెరుగుపరిచేలా చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలని యనమల రామకృష్ణుడు ప్రభుత్వానికి సూచించారన్నమాట. ప్రభుత్వాలు సాధారణంగా వైట్ పేపర్సే ప్రకటించవు.. ఇక గ్రీన్ పేపర్‌ను విడుదల చేసి... ఇక మా వల్ల కాలేదు.. అందరం కలిసి చక్కదిద్దుదాం అని చర్చలకు.. సంప్రదింపులకు వచ్చే అవకాశాలు అసలు ఉండవు. అలా వస్తే తమకు చేతకాలేదని ఒప్పుకున్నట్లే అవుతంది.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
ఏపీ ప్రభుత్వం జీవోలే వెబ్‌సైట్ లో పెట్టడం లేదు. అన్నీ సీక్రెట్‌గా ఉంచోంది. అరకొరగా గెజిట్‌గా చూపిస్తున్నప్పటికీ.. కొన్ని వందల జీవోలు రహస్యంగానే ఉంటున్నాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అలాంటి వైట్‌పేపర్లు.. వాటికి తోడు యనమల డిమాండ్ చేసినట్లుగా గ్రీన్ పేపర్స్ రిలీజ్ చేసే పరిస్థితి అసలు ఉండకపోవచ్చు. అయినా ప్రతిపక్ష నేతగా ఓ కొత్త డిమాండ్‌ను అధికారపక్షం ముందు ఉంచారు యమనల.
Also Read: మందు రెడీ .. రెండు రోజుల్లో ఒమిక్రాన్ తగ్గిస్తా..! నెల్లూరు ఆనందయ్య చాలెంజ్ !
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?