భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు మ్యాచ్ రేపు (డిసెంబర్ 26వ తేదీ) సెంచూరియన్‌లో ప్రారంభం కానుంది. 2017-18 తర్వాత భారత్.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. దక్షిణాఫ్రికాలో భారత్ ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. ఈ సిరీస్‌లో అయినా విజయం సాధించి బోణీ కొడుతుందేమో చూడాలి మరి!


టీమిండియా ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఏడు సార్లు పర్యటించింది. సిరీస్ విజయం ఒక్కసారి కూడా దక్కకపోగా.. కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. 1992లో మొదటిసారి భారత్.. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడింది.


భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని తెలుస్తోంది. సెంచూరియన్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఈ మ్యాచ్ చూడవచ్చు.


ఈ రెండు జట్లూ ఇప్పటివరకు 39 మ్యాచ్‌ల్లో తలపడగా.. 15 విజయాలతో దక్షిణాఫ్రికా ముందంజలో ఉంది. భారత్ మొత్తంగా 14 విజయాలు సాధించింది. 10 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. దక్షిణాఫ్రికాలో భారత్ 20 టెస్టులు ఆడగా.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో మొదటి విజయం రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో రాగా.. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఒకటి, విరాట్ నాయకత్వంలో ఒకటి భారత్ ఖాతాలో పడ్డాయి.


ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా దూరం అయ్యారు. అయితే అజింక్య రహానేకు అవకాశం వస్తుందో రాదో తెలియాల్సి ఉంది. ఇండియా-ఏ తరఫున మంచి ప్రదర్శన కనబరచిన హనుమ విహారికి మొదటి టెస్టు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.


ఇక దక్షిణాఫ్రికాను కూడా గాయాల బెడద వేధిస్తుంది. ప్రధాన పేస్ బౌలర్ ఆన్రిచ్ నోర్జే గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరం అయ్యాడు. తన స్థానంలో ఆలివియర్ ఆడే అవకాశం ఉంది. ఆలివియర్ ఎప్పుడో 2019లో దక్షిణాఫ్రికా తరఫున క్రికెట్ ఆడాడు.


దక్షిణాఫ్రికాలో వేయికి పైగా టెస్టు పరుగులు చేసిన ఏకైక భారత బ్యాటర్ సచిన్ టెండుల్కరే. ఆయన ఈ దేశంలో 1,161 పరుగులు సాధించారు. కోహ్లీ ప్రస్తుతం 558 పరుగులతో ఉన్నాడు. ఈ సిరీస్‌తో ఆ రికార్డుకు మరింత చేరువ అవుతాడో.. తిరిగి ఫాంలోకి వచ్చి బద్దలు కొడతాడో చూడాలి.


భారత్ తుదిజట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్


దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా)
డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, టెంపా బవుమా, రాసీ వ్యాన్ డెర్ డసెన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కైల్ వెరీన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఆలివియర్, లుంగీ ఎంగిడి


Also Read: 83 Film Update: ప్రపంచకప్‌ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్‌ డెవిల్స్‌..! ఎందుకో తెలుసా?


Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్‌!


Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?


Also Read: IND vs SA: ద్రవిడ్‌ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!


Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!


Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్‌, కోహ్లీ ప్రశంసలు