'బిగ్ బాస్'లో ఏం జరిగిందో జనాలు అందరూ చూశారు. షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు ముద్దులు ఇచ్చుకున్నారు. కౌగిలించుకున్నారు. స్నేహితులు ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? కౌగిలింత ఏముంది? అని కొందరు అనొచ్చు. కానీ, వాళ్లు ఇద్దరు చేసింది వాళ్ల కుటుంబ సభ్యులు సైతం కొంత ఇబ్బందికరంగా ఫీలయ్యేలా ఉన్నాయని అంటే ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అది గతం గతః. 'బిగ్ బాస్' నుంచి షణ్ముఖ్, సిరి బయటకు వచ్చారు. ఆ తర్వాత 'బిగ్ బాస్' కంటే ఉత్కంఠ కలిగించే ఎపిసోడ్ మొదలైంది.


షణ్ముఖ్ 'బిగ్ బాస్'లోకి వెళ్లడానికి ముందు దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. హౌస్‌లో అతడు చేసిన పనులు వల్ల ఆ ప్రేమ పెటాకులు అయ్యిందని బయట టాక్. అతడికి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పిందని చాలామంది అనుకుంటున్నారు. దీనిపై దీప్తి ఇప్పటి వరకూ నేరుగా ఏమీ చెప్పలేదు. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల్లో ఏదో జ‌రుగుతున్న‌ట్టు లోతైన అర్థాలు ఉండే పోస్టులు పెడుతున్నారు. తాను ఈజీగా టార్గెట్ అయినట్టు మొన్నో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకేం చెప్పడానికి లేదన్నట్టు చెప్పుకొచ్చారు. లేటెస్టుగా ఆమె మరో పోస్ట్ చేశారు.
Also Read: ఇంకేం మాట్లాడాలిరా!? దీప్తి సునైన మళ్లీ ఏసేసిందిగా!!
"మార్పు మనకు అసౌకర్యంగా అనిపించినా... అవసరమే" అని దీప్తి సునైనా లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆమె మాట్లాడుతున్నది ఏ మార్పు గురించి? అదే జనాల్లో సందేహం. షన్నుతో బ్రేకప్ గురించా? కాదా? అసలు, వాళ్లిద్దరి మధ్య ప్రస్తుతం ఎలాంటి రిలేషన్ ఉంది? తెలుసుకోవాలని జనాలు కుతూహలంగా ఉన్నారు. కానీ, ఆమె మాత్రం క్లారిటీగా చెప్పకుండా ఏవేవో పోస్టులు చేస్తున్నారు. దీప్తి సునైనా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం ఇన్ యాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.






Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మ‌రి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి