హైదరాబాద్ రవీంద్ర భారతీలో ఘంటసాల శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఘంటసాల పురస్కారాన్ని గాయని.. పి.సుశిలకు ప్రదానం చేశారు. ఘంటసాల పురస్కారం తన చేతుల మీదగా అందజేయడం అదృష్టంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
భాషా సంస్కృతులు క్రమంగా పడిపోతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రభుత్వాలు సైతం తెలుగు భాషా ఔన్నత్యం కోసం మద్దతివ్వట్లేదని వ్యాఖ్యానించారు. ఘంటసాల పాటలు జీవితాలతో ముడివేసుకుని ఉన్నాయని చెప్పారు. అనేక రకాలైన కష్టాలే.. ఘంటసాలను మానవతామూర్తిగా నిలిచేలా చేశాయని చెప్పారు. ఘంటసాల.. తెలుగువీర లేవరా పాట వింటే ఎంతో భావోద్వేగం కలుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా గుర్తు చేస్కున్నారు.
మెుదట్లో సినిమా రంగం బాధ్యతాయుతమైన పాత్ర పోషించేదని.. నేటి తరం సినిమా రంగాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సామాజిక స్పృహతో ఉన్న ఉన్న సినిమాలపైనే చర్చ అనేది జరుగుతుందని ఆయన అన్నారు.
ఎన్టీఆర్‌ను ‘మనదేశం’ చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయం చేసిన నటి, నిర్మాత కృష్ణవేణిని జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా సన్మానించారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రోశయ్యకు నివాళులు..
మాజీ సీఎం కొణిజెటి రోశయ్య పార్థీవదేహానికి జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోశయ్య మరణం బాధ కలిగించిందని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్త నుంచి సీఎం, గవర్నర్ స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఆయనకు కళలు, సాహిత్యంపై అభిమానం ఉందని చెప్పారు.
Also Read: CJI NV Ramana: న్యాయం చెప్పడానికి కేవలం కోర్టులే అక్కర్లేదు... సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read: Navy Day 2021: ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మనదే.. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ప్రదర్శన
Also Read: Shyam Singha Roy: 'సిరివెన్నెల' ఆఖరి పాట.. ఆ విషయం ఆయనకు ముందే తెలుసా..?
Also Read: వైఎస్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?