సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చివరిసారిగా 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో పాటలు రాశారు. ఇదే ఆయన చివరి పాట అవుతుందని ఎవరూ ఊహించలేదు కానీ సిరివెన్నెల మాత్రం ముందే ఊహించారట. ఈ విషయాన్ని 'శ్యామ్ సింగరాయ్' చిత్రదర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వెల్లడించారు. డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన ఆఖరి పాటను 'సిరివెన్నెల' పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. హీరో నాని, దర్శకుడు రాహుల్ ఈ పాట వెనుకున్న స్టోరీని వెల్లడించారు.
దర్శకుడు రాహుల్ వీడియోలో మాట్లాడుతూ.. ''నవంబర్ 3వ తేదీ రాత్రి ఫోన్ చేసి.. ఆరోగ్యం సహకరించడం లేదు.. వేరేవారితోనైనా రాయిద్దామని అన్నారు. నెక్స్ట్ డే ఉదయాన్నే కాల్ చేసి నిద్రలేపారు. ఆరోజు దీపావళి. పల్లవి అయిపోయింది చెప్తా రాస్కో అన్నారు చాలా ఎగ్జైటెడ్ గా.. సడెన్ గా చెప్పేసరికి ఎక్కడ రాయాలో తెలియక పక్కనే ఉన్న మహాభారతం పుస్తకం ఉంటే దాని మీద లైన్స్ రాసుకున్నాను. అద్భుతమైన ఆరు లైన్లు ఇచ్చారు. అందులో మొదటి లైన్లో ఆయన పేరు రాశారు. అది చూసి ఎందుకు సార్ మీ సంతకం ఇచ్చారు ఆ పేరుకి అని అడిగాను. బహుశా ఇదే నా ఆఖరి పాట అవ్వొచ్చు అని గట్టిగా నవ్వారు. ఈ పాట రికార్డింగ్ మొదలుపెట్టినరోజునే ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది. అందుకే ఆయన పేరే పెట్టాం'' అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’లో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యదేవ్ జంగా కథ అందించిన ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: బాలయ్య షోలో మహేష్ బాబు.. ఫ్యాన్స్ వెయిటింగ్..
Also Read:పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: కత్రినా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..
Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి