బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. అంతా సీక్రెట్ గా చేయాలనుకుంటున్నారు కానీ ఎప్పటికప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 7 నుంచి 9 తేదీల్లో ఈ జంట వివాహం జరగబోతుందనే విషయం తెలుస్తోంది. ఎలాగంటే.. కత్రినా-విక్కీ తమ బౌన్సర్లు, సెక్యూరిటీ స్టాఫ్, పెర్సనల్ స్టాఫ్ కోసం ఇదే తేదీల్లో రాజస్థాన్ లోని సవై మాదోపూర్ జిల్లాలో చౌత్ కా బర్వాడ ధర్మశాలను బుక్ చేశారు. 


ఆ ధర్మశాలకు చెందిన మ్యానేజర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దాదాపు 27 రూమ్స్ ను, 5 హాల్స్ ను ముంబైకి చెందిన ఓ ఈవెంట్ కంపెనీ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. అలానే చౌత్ మటా కాంప్లెక్స్ లో 30 రూమ్స్ ను, 5 పెద్ద హాల్స్ ను బుక్ చేశారట. ఈ ధర్మశాలలోనే కాకుండా.. కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా రూమ్స్ ను బ్లాక్ చేశారు.  


దీంతో పాటు కత్రినాకు పెట్టే మెహందీను రాజస్థాన్‌లో ప్రసిద్ధిచెందిన 'సోజత్‌ మెహందీ' నుంచి ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. సోజత్‌లోని కళాకారులు ఎలాంటి రసాయనాలు లేకుండా చేతితో మెహందీను తయారు చేస్తారట. దీని విలువ సుమారు రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకు ఉంటుందని సమాచారం. ఇక విక్కీ పెళ్లి వేడుకకకు గుర్రంపై గ్రాండ్ ఎంట్రీ ఇస్తారట. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. 


ఈ కార్యక్రమానికి 125 మంచి వీఐపీ అతిథులు హాజరుకానున్నారు. ముంబై నుంచి ప్రయాణించే గెస్ట్ లు మొదట జైపూర్ లో దిగుతారు. వారికోసం భారీ లగ్జరీ బస్సులు, కార్లు కూడా లుక్ చేశారట. ఈ పెళ్లిలో ప్రముఖ రాజస్థానీ వంటకాలు వడ్డించనున్నారు. స్పెషల్ గా 'కేర్ సంగ్రీ' అనే వంటకం తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక విక్కీ, కత్రినా తన పెళ్లిలో సభ్యసాచి వస్త్రాలను ధరించబోతున్నారు. 


Also Read:పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..


Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!


Also Read: బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...


Also Read: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం


Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి