Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

భీమ్లానాయక్ సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ఆ అప్ డేట్స్ చూద్దాం...

Continues below advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి నటిస్తోన్న మూవీ 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రైటర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ దుమ్ములేపుతున్నాయి. మరిన్ని అప్ డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు  పవన్-రానా అభిమానులు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ జోరు పెంచారు మేకర్స్. తాజాగా  'భీమ్లా నాయక్' ఫోర్త్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు. 

Continues below advertisement

భీమ్లానాయక్ నుంచి ‘అడవి తల్లి పాట’ ను డిసెంబరు 1వ తేదీన విడుదల చేయాల్సింది. అయితే పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట విడుదల ఆపేసింది. దీంతో ఈ పాట ఇప్పుడు రిలీజ్ చేసింది.  డిసెంబరు 4న (శనివారం) ఉదయం 10.08 గంటలకు ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్టే సాంగ్ విడుదల చేశారు.   'అడవితల్లి మాట' అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. 

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు తెలుగు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోంది. మలయాళ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా బిజూ మేనన్ నటించగా.. ఆ పాత్ర పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడు. మరో కీలక పాత్ర పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి నటించాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ , రానాకు జోడీగా సంయుక్త మీనన్ కనిపించనున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

Also Read: సన్నీ కాదు.. సిరి కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే..?

Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!

Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!

Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

Also Read: టిక్కెట్ రేట్లు తగ్గించం, అండగా ఉంటాం.. టాలీవుడ్‌కు తెలంగాణ మంత్రి తలసాని భరోసా !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola