నట సింహ నందమూరి బాలకృష్ణ... సూపర్ స్టార్ మహేష్ బాబు... వీళ్లిద్దరూ షూటింగ్ చేయడానికి రెడీ అన్నారు. వీళ్లిద్దరూ త్వరలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడానికి రెడీ అవుతున్నారు. అయితే... అది సినిమా కోసం కాదు. ఓ టాక్ షో కోసం! ప్రజెంట్ 'ఆహా' ఓటీటీ కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ షోకు మంచు మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు విష్ణు, లక్ష్మీ... నాని, బ్రహ్మానందంతో పాటు అనిల్ రావిపూడి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది.
అవును... 'అన్ స్టాపబుల్' షోలో మహేష్ బాబు గెస్టుగా కనిపించనున్నారు. మహేష్ వస్తారనేది కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఆ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ 4న (శనివారం) ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో 'అన్ స్టాపబుల్' షో కోసం స్పెషల్‌గా వేసిన సెట్‌లో షూటింగ్ చేయనున్నారు. బాలకృష్ణ, మహేష్ బాబు మధ్య బాండింగ్ బయటకు వచ్చిన సందర్భాలు తక్కువ. అందుకని, ఈ షో కోసం అటు నందమూరి... ఇటు ఘట్టమనేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షోలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య జరిగిన సరదా సంఘటనలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమానికి మహేష్ అతిథిగా వచ్చారు. అప్పుడు అబ్బాయ్ షోకు వెళితే... ఇప్పుడు బాబాయ్ షోకు రానున్నారు. మరి, ఈ షోలో మోకాలికి జరగనున్న సర్జరీ గురించి మహేష్ బాబు ఏమైనా చెబుతారో? లేదో? చూడాలి. ఈ వారం విడుదలైన బాలకృష్ణకు 'అఖండ' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: నోటిలో బ్లేడుతో అనసూయ... బన్నీ బైక్ స్టంట్
Also Read: టాలీవుడ్‌కు బాలకృష్ణ భరోసా... 'అఖండ'తో అది తప్పని!
Also Read: టిక్కెట్ రేట్లు తగ్గించం, అండగా ఉంటాం.. టాలీవుడ్‌కు తెలంగాణ మంత్రి తలసాని భరోసా !
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఆ రోజున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారా?
Also Read: 'మరక్కార్' రివ్యూ: మనకు తెలియని యోధుడు... తెలిసిన సినిమా!
Also Read: టికెట్ రేట్లపై ఏపీ సర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంటర్!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి