Pushpa Trailer Tease: నోటిలో బ్లేడుతో అనసూయ... బన్నీ బైక్ స్టంట్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'పుష్ప'. ఈ నెల 6న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దానికి ముందే అల్లు అర్జున్ ప్రేక్షకులను  చిన్న వీడియోతో టీజ్ చేశారు.

Continues below advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా 'పుష్ప: ద రైజ్'. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ఈ నెల 6న (సోమవారం) ట్రైలర్ విడుదల చేయనున్నారు. దానికి మూడు రోజుల ముందే ఇప్పుడు చిన్న వీడియోతో అల్లు అర్జున్ ఆడియ‌న్స్‌ను టీజ్ చేశారు. 'పుష్ప' ట్రైలర్ టీజ్ పేరుతో వీడియో విడుదల చేశారు. అదెలా ఉందో మీరూ చూడండి.

Continues below advertisement

ఆల్రెడీ 'పుష్ప' టీజర్, ఇప్పటివరకూ విడుదల చేసిన పాటల్లో కొన్ని విజువల్స్ చూపించారు. ఇప్పుడు ఈ టీజింగ్ వీడియోలో ఏం చూపించారు? అంటే... టీజ‌ర్‌లో అల్లు అర్జున్ బైక్ స్టంట్ కొంచెం చూపించారు కదా. ఇప్పుడు ఇందులో ఆ సీన్స్ ఇంకొంచెం చూపించారు. సునీల్, అజయ్, అనసూయ, రావు రమేష్, ధనుంజయ తదితరుల పాత్రలను అలా అలా చూపించారు. నోట్లో బ్లేడు పెట్టుకుని ఒకరికి అనసూయ వార్నింగ్ ఇస్తున్న దృశ్యాన్ని ఇందులో చూడవచ్చు. అల్లు అర్జున్ బైక్ స్టంట్ ఇరగదీశాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. రష్మికా మందన్నతో పాటు సాంగ్స్ విజువల్స్ కూడా యాడ్ చేశారు.

ప్రత్యేక పాత్రలో సమంత సందడి చేయనున్న ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. సుకుమార్ సినిమా అంటే హిట్ సాంగ్స్ ఇచ్చే దేవి శ్రీ ప్రసాద్, స్పెషల్ సాంగ్ ఎలా చేశారోనని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

Pushpa Trailer Tease:


Also Read: టాలీవుడ్‌కు బాలకృష్ణ భరోసా... 'అఖండ'తో అది తప్పని!
Also Read: టిక్కెట్ రేట్లు తగ్గించం, అండగా ఉంటాం.. టాలీవుడ్‌కు తెలంగాణ మంత్రి తలసాని భరోసా !
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఆ రోజున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారా?
Also Read: సూపర్ స్టార్ మోకాలికి సర్జరీ.. రెండు నెలలు ఇంట్లోనే..
Also Read: 'మరక్కార్' రివ్యూ: మనకు తెలియని యోధుడు... తెలిసిన సినిమా!
Also Read: టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?
Also Read: తల్లితో సమంత వాట్సాప్ చాట్... ఆ ఆత్మవిశ్వాసానికి సలామ్ కొట్టాల్సిందే
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement