Unstoppable: బాలయ్య షోలో మహేష్ బాబు.. ఫ్యాన్స్ వెయిటింగ్.. 

బాలయ్య హోస్ట్ చేస్తోన్న 'అన్‌ స్టాప‌బుల్‌' షోకి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Continues below advertisement

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌ స్టాప‌బుల్‌' టాక్ షో తొలి ఎపిసోడ్‌కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు లక్ష్మీ మంచు, విష్ణు మంచు వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని గెస్టుగా రాగా.. మూడో ఎపిసోడ్ కి బ్రహ్మానందం, అనీల్ రావిపూడి అతిథులుగా వచ్చారు. ఈ మూడు ఎపిసోడ్ లకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

Continues below advertisement

ఇప్పటివరకు వచ్చిన గెస్ట్ లు ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని గెస్ట్ గా తీసుకొస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి గెస్ట్ గా వచ్చి పాతిక లక్షలు గెలుచుకున్నారు మహేష్ బాబు. ఆ మొత్తం డబ్బుని ఛారిటీకి డొనేట్ చేశారు. ఇప్పుడు బాలయ్య షోలో కనిపించబోతున్నారు మహేష్ బాబు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


బాలయ్య.. మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేయడమనేది ఇంట్రెస్టింగ్ విషయం. వీరిద్దరూ కలిసి బయట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఈ కాంబో ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతుంది. ఎప్పటిలానే మహేష్ తనదైన సెటైర్లు వేస్తుంటే.. బాలయ్య నవ్వులు చిందించారని సమాచారం. ఈ షోని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 
ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు కూడా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోపక్క మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాను పూర్తి చేయనున్నారు. సంక్రాంతికి రావాలనుకున్న ఈ సినిమా ఏప్రిల్ 1కి వాయిదా పడింది.  

Also Read:పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..

Also Read:  కత్రినా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..

Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!

Also Read: బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...

Also Read: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం

Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola