రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైంది. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపు తగాదాలు ఉన్న , ఎన్ని వర్గాలు ఉన్న ఆ ప్రభావం వై.యస్.ఆర్ , రోశయ్య మధ్య ఉన్న బంధంపై పడలేదు. నిజానికి వై.ఎస్.ఆర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఓ సారి పీవీ నరసింహారావుకు రోశయ్య ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఘటనను వై.ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. రోశయ్య స్వభావం తెలిసిన వై.ఎస్ ఎప్పుడూ ఆయనను దూరం పెట్టలేదు. కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ అసమ్మతినేతగా గుర్తింపు పొందారు. దీంతో విజయభాస్కరరెడ్డి ప్రోత్సాహంతో రోశయ్య పీవీకి .. వైఎస్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. అప్పట్లోఆ విషయం సంచలనాత్మకమమయింది. కానీ తర్వాత కాలంలో రోశయ్య వైఎస్‌కు అత్యంత ఆత్మీయుడయ్యారు.
Also Read : మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !
1999లో ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు శాసన సభలో చర్చించాల్సిన అనేక అంశాలపై రోశయ్యపైనే ఎక్కువగా ఆధారపడేవారు వైఎస్. 2004లో వై.ఎస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి విజయం సాధించిన రోశయ్య వై.ఎస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా మాత్రమే కాదు శాసనసభా వ్యవహారాలు కూడా చూసుకునేవారు. శాసన సభలో నెంబర్ 2గా వ్యవహరించారు. తన వాగ్దాటితో ప్రతిపక్షానికి చమటలు పట్టించిన నేర్పరిగా గుర్తింపు పొందారు.
Also Read : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !
2009లో రోశయ్య అసెంబ్లీకి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో మంత్రి పదవికి శాసన సభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. ఆ తరువాత 2009లో ఎన్నికలలో విజయం సాదించాక రోశయ్యను వై.యస్ యదావిధిగా ఆర్ధిక మంత్రిగా కొనసాగించారు వైఎస్. చాలా సందర్భాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనా శైలిని పొగిడేవారు. అదే సమయంలో సుతిమెత్తగా హెచ్చరికలు కూడా జారీ చేసేవారు.
Also Read: Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు ప్రవేశ పెట్టడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ క్రమంమలో ఆయన ఎక్కడ సభలో మాట్లాడినా ఆయన పథకాలు ప్రవేశపెడుతూంటారు. అయితే ఆర్థిక మంత్రిగా వాటికి నిధులు సర్దుబాటు చేయాల్సింది రోశయ్యనే. అందుకే ఆయన ఎప్పుడు పథకాలు ప్రకటిస్తారోనని ఆందోళనతో కంట్రోల్ చేసేందుకు .. ప్రయత్నించేవాడినని చెప్పేవారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఎలా ఉన్నా... చివరి వరకూ ఆత్మీయంగా ఉన్నది రోశయ్యనే. చివరికి వైఎస్ మరణవార్తను అధికారికంగా చెప్పింది కేబినెట్‌లోఅత్యంత సీనియర్‌గా ఉన్న రోశయ్యనే.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి